Warangal Crime : సినీ ఫక్కీలో చోరీలు, క్లూస్ చిక్కకుండా కారంపొడి-ఎలా దొరికారంటే?
08 November 2023, 17:49 IST
- Warangal Crime : పగలు సాధారణ పనులు చేసుకుంటూ... రాత్రులు రెక్కీ చేసి తాళాలు వేసి ఇండ్లలో చోరీ చేస్తోంది ఓ గ్యాంగ్. చోరీ తర్వాత క్లూస్ దొరకకుండా కారంపొడి చల్లిపరారవుతారు. ఈ గ్యాంగ్ ను వరంగల్, హనుమకొండ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.
కారంపొడి గ్యాంగ్ అరెస్టు
Warangal Crime : రాత్రి పూట ఎవరూ లేని సమయంలో ఇండ్లలోకి దూరి దొంగతనాలు చేయడం.. సినీ ఫక్కీలో ఎవరికీ ఆనవాళ్లు చిక్కకుండా కారంపొడి చల్లి తప్పించుకుంటున్న గ్యాంగ్అరెస్ట్ అయ్యింది. వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు జాయింట్ఆపరేషన్చేసి కారంపొడి గ్యాంగ్‌ను పట్టుకున్నారు. నిందితుల నుంచి 19 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, నాలుగు స్మార్ట్ఫోన్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ కాకతీయ కాలనీలో వెహికల్వాటర్సర్వీసింగ్వర్క్ చేస్తున్న ఎండీ అఫ్జల్‌పాషా అలియాస్లొట్టి, షేక్‌అస్లాం, ఏసీ మెకానిక్ఎండీ ఫహీం అక్రం, పాత ఇనుప సామాన్బిజినెస్చేసే ఎండీ షాహెద్, చికెన్ సెంటర్ వర్కర్ఎండీ గౌస్‌పాషా అందరూ స్నేహితులు. ఒకే ఏరియాలో ఉంటుండటంతో ఒకరి ద్వారా మరొకరు ఇలా అందరూ ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతూ మద్యం తాగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. కాగా వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో సులువుగా సంపాదించేందుకు దొంగతనాలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
కారంపొడి చల్లి పరారీ
ఒక ముఠాగా ఏర్పడిన ఆ ఐదురుగు పొద్దంతా ఎవరి పనుల్లో వాళ్లుంటూ రాత్రిపూట చోరీలు చేసేందుకు ప్లాన్ వేస్తారు. ఈ మేరకు రాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ నుంచి వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రి చోరీలకు పాల్పడ్డారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని లష్కర్ బజార్, న్యూ రాయపుర, కాకతీయ కాలనీ ఏరియాల్లో మూడు ఇండ్లను కొల్లగొట్టి బంగారం, వెండి నగలతో పాటు నగదు దొంగిలించారు. కాజీపేట స్టేషన్ పరిధిలోని ఫాతిమా నగర్, సోమిడి ఏరియాల్లో రెండు ఇండ్లు, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి గుండ్ల సింగారంలో మరో రెండు ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేశారు. కాగా తాము పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సినీ స్టైల్లో ప్లాన్ వేశారు. దొంగతనాల అనంతరం తమ ఆనవాళ్లు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌లకు చిక్కకుండా ఆ ఇంట్లో మొత్తం కారంపొడి చల్లి అక్కడి నుంచి పరారయ్యేవారు. దీంతో ఆయా కేసులను ఛేదించడానికి పోలీసులకు కూడా ఇబ్బందులు తలెత్తేవి.
టెక్నాలజీ సాయంతో..
దొంగతనాల విషయమై వరంగల్ పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వరంగల్ పోలీస్కమిషనర్అంబర్కిషోర్ఝా ఆదేశాల మేరకు వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు స్పెషల్ఫోకస్పెట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో పాటు వారి వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. అనంతరం హనుమకొండ చౌరస్తాలో తిరుగుతున్న ఐదుగురు నిందితులను వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు పట్టుకున్నారు. కాగా వారు చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేసే రఫీక్, రెహాన బేగం ఇద్దరూ పరారీలో ఉన్నారు. నిందితులను పట్టుకోవడంతోపాటు దొంగ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డీసీపీ డి.మురళీధర్, ఏసీపీ బి.మల్లయ్య, సీసీఎస్సీఐ బి.శంకర్ నాయక్, హనుమకొండ సీఐ కరుణాకర్ తదితర సిబ్బందిని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
(రిపోర్టింగ్ : హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)