తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bomb Scare : విమానంలో బాంబు ఉందని.. ‘సరదాగా’ ఈ-మెయిల్​ పంపిన 13ఏళ్ల బాలుడు!

Bomb scare : విమానంలో బాంబు ఉందని.. ‘సరదాగా’ ఈ-మెయిల్​ పంపిన 13ఏళ్ల బాలుడు!

Sharath Chitturi HT Telugu

23 June 2024, 15:31 IST

google News
  • Hoax bomb threat :  దిల్లీ విమానాశ్రయం బాంబు బెదిరింపు ఘటనలో పలు షాకింగ్​ విషయాలు వెలువడ్డాయి. బాంబు ఉందని ఈమెయిల్​ పంపించిందిన ఓ 13ఏళ్ల బాలుడు..!

విమానంలో బాంబు ఉందని.. ‘సరదాగా’ ఈమెయిల్​ పంపిన 13ఏళ్ల బాలుడు!
విమానంలో బాంబు ఉందని.. ‘సరదాగా’ ఈమెయిల్​ పంపిన 13ఏళ్ల బాలుడు!

విమానంలో బాంబు ఉందని.. ‘సరదాగా’ ఈమెయిల్​ పంపిన 13ఏళ్ల బాలుడు!

Hoax bomb threat Delhi airport : దిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి కొన్ని రోజుల క్రితం బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. అప్రమత్తమైన అధికారులు.. తనిఖీ చేపట్టగా.. విమానంలో ఎలాంటి బాబు లేదని తేల్చారు. అయితే.. బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపింది ఓ 13ఏళ్ల బాలుడని తాజాగా తేలింది. అంతేకాదు.. ఆ ఈ-మెయిల్​ ‘సరదాగా’ పంపానని ఆ బాలుడు పోలీసులకు చెప్పాడు!

ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు.. మరో విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. అందులో కూడా నిజం లేదు! ఆ బాంబు బెదిరింపునకు పాల్పడింది కూడా ఒక యువకుడే. ఈ వార్త విన్న ఈ 13ఏళ్ల బాలుడు.. ప్రభావితమై, తాను కూడా బెదిరించాలని భావించాడు. అందుకే ఈమెయిల్​ చేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఐజీఐ ఎయిర్ పోర్టు) ఉషా రంగ్నాని తెలిపారు.

జూన్ 18న దుబాయ్ వెళ్తున్న విమానంలో బాంబు ఉందంటూ దిల్లీ విమానాశ్రయానికి ఈ-మెయిల్ వచ్చింది. పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత కోసం అన్ని మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్, ఎస్ఓపీలు పాటించామని డీసీపీ తెలిపారు.

Delhi airport bomb threat news : అయితే విచారణలో ఆ మెయిల్ ఫేక్ అని తేలింది. అది.. ఉత్తరాంచల్​లోని పితోర్​గఢ్​కు చెందిన ఈ-మెయిల్ ఐడీ అని స్పష్టమైంది. ఈమెయిల్ పంపిన వెంటనే డిలీట్ చేసినట్లు గుర్తించామని రంగ్నానీ తెలిపారు.

పోలీసు బృందం బాలుడిని అదుపులోకి తీసుకుంది. అతను తన తల్లిదండ్రులు తనకు చదువు అవసరాల కోసం ఒక మొబైల్ ఇచ్చారని, దాని ద్వారా అతను ఈ-మెయిల్ పంపానని, తరువాత ఐడిని తొలగించానని చెప్పాడు.

"అతను భయపడి తన తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. అతడిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించాము,' అని డీసీపీ తెలిపారు.

విమానాశ్రయాలు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు ఇటీవలి కాలంలో పెరిగాయి. జైపూర్, చెన్నై, వారణాసి సహా 41 విమానాశ్రయాలకు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇది విపరీతమైన తనిఖీలకు దారితీసింది. ఇది గంటల తరబడి కొనసాగింది. అయితే బెదిరింపులన్నీ ఫేక్ అని తేలింది.

శనివారం కూడా.. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో నిలిపివేశారు.

గత వారం ముంబైలోని సుమారు 60 ఆసుపత్రులకు కూడా తమ ఆవరణలో బాంబులు ఉన్నాయంటూ ఫేక్ మెయిల్స్ వచ్చాయి. ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయని, అన్ని ఈ-మెయిల్స్ వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్​ (వీపీఎన్) ఉపయోగించి ఆసుపత్రి పబ్లిక్ మెయిల్-ఐడిలకు పంపారని ముంబై పోలీసులు తెలిపారు.

నకిలీ బాంబు బెదిరింపులు, సందేశాలు విమాన షెడ్యూల్​కు అంతరాయం కలిగిస్తాయి. ప్రయాణికులందరినీ, వారి లగేజీని, మొత్తం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా గంటలు, గంటలు ఆలస్యమవుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఐదేళ్ల నిషేధం విధించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ప్రతిపాదించినట్లు ఎన్​డీటీవీ తెలిపింది.

తదుపరి వ్యాసం