తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Heatwave Alert : ఐఎండీ ‘హీట్​వేవ్​’ అలర్ట్​.. భానుడి భగభగలు మొదలు!

Heatwave alert : ఐఎండీ ‘హీట్​వేవ్​’ అలర్ట్​.. భానుడి భగభగలు మొదలు!

Sharath Chitturi HT Telugu

20 February 2023, 8:25 IST

google News
  • Heatwave alert : దేశంలో ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి! ఈ క్రమంలోనే పలు ప్రాంతాలకు అప్పుడే హీట్​వేవ్​ అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ.

ప్రజలకు హీట్​వేవ్​ అలర్ట్​.. భానుడి భగభగలు మొదలు!
ప్రజలకు హీట్​వేవ్​ అలర్ట్​.. భానుడి భగభగలు మొదలు!

ప్రజలకు హీట్​వేవ్​ అలర్ట్​.. భానుడి భగభగలు మొదలు!

IMD Heatwave alert : మార్చ్​ నెల రాకముందే.. భానుడి భగభగలు మొదలయ్యాయి! అప్పుడే.. దేశంలో తొలి హీట్​వేవ్​ హెచ్చరికలు జారీ చేసేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). రానున్న రెండు రోజుల్లో.. పశ్చిమ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా గుజరాత్​లోని కచ్​, కోంకణ్​ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

రెండు రోజుల పాటు..

"వెస్టర్న్​ డిస్టర్బెన్స్​ ప్రభావం పశ్చిమ హిమాలయ ప్రాంతాలపై ఆదివారం నుంచి ఉంటుంది. ఫలితంగా కశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, పతాన్​కోట్​ ప్రాంతాల్లో రానున్న 2-3 రోజుల్లో వర్షాలు కురవొచ్చు. ఇక దేశవ్యాప్తంగా.. కనిష్ఠ- గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఇప్పటికే సాధారణం కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. పశ్చమ తీరం, గుజరాత్​ ప్రాంతాల్లో హీట్​ వేవ్స్​ వస్తాయని ముందే హెచ్చరించాము. సోమవారం నుంచి 2, 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరవచ్చు," అని ఐఎండీ శాస్త్రవేత్త డా. నరేశ్​ మీడియాకు వెల్లడించారు.

Heatwave alert in India : శిమ్లాలో తేలికపాటి వర్షపాతం నమోదవుతుందని నరేశ్​ స్పష్టం చేశారు. దక్షిణ భారతంలో పొగమంచు కూడా కనిపించడం లేదు, ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లోనే, ఉదయం పూట పొగమంచు కనిపిస్తోందని అన్నారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల కన్నా ఎక్కువగానే ఉందని నరేశ్​ వెల్లడించారు. రానున్న రోజుల్లో అది 1 డిగ్రీ పడొచ్చని, వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

Temperatures in Hyderabad : దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ తీరంలోని రాష్ట్రాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. గుజరాత్​, మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలో సాధారణ ఉష్ణోగ్రతల డీవియేషన్​ 5-10 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఫిబ్రవరి అంటే దేశంలో శీతాకాల సమయం. కానీ గుజరాత్​లోని బుజ్​ ప్రాంతంలో గత వారంలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కన్నా ఇది 10 డిగ్రీలు ఎక్కువ. రాజస్థాన్​ బికనీర్​లో అత్యధిక ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలుగా ఉంది. జమ్ముకశ్మీర్​లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా డీవియేషన్​ 7-9 డిగ్రీలు ఎక్కువగా ఉంటోంది.

Temperatures in Telangana : సాధారణంగా శీతాకాలంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఈ ఏడాది అలా జరగలేదు. ఫలితంగా.. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి నుంచే పెరగడం మొదలుపెట్టాయి. రానున్న రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు.

తదుపరి వ్యాసం