తెలుగు న్యూస్ / ఫోటో /
Winter: ఉత్తరాదిని కప్పేస్తోన్న పొగమంచు.. పరిస్థితి ఎలా ఉందో చూడండి
- ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలం తీవ్రత నానాటికీ పెరుగుతోంది. చాలా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేస్తోంది. దీంతో రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో పొగ మంచు దట్టంగా ఉంటోంది. పంజాబ్, ఈశాన్య ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీలో పొగ మంచు తీవ్రంగా ఉంటోంది. సోమవారం ఇది మరింత ఎక్కువగా కనిపించింది. శాటిలైట్ చిత్రాలు పరిస్థితిని కళ్లకు కట్టాయి. రానున్న ఐదు రోజుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫొటోలతో పాటు వివరాలు ఇవే.

(1 / 7)
ఘజియాబాద్‍ను సోమవారం ఉదయం తీవ్రమైన చలి, పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‍వేపై కార్లు, ట్రక్‍లు, బైక్‍లు నడిపే వారు హెడ్‍లైట్‍లు ఆన్ చేసుకోవాల్సి వచ్చింది. పొగ మంచుతో ముందున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.(Sakib Ali/HTPhoto)
(4 / 7)
పంజాబ్‍లోని అమృత్‍సర్ లో దట్టమైన పొగమంచు మధ్యే పాఠశాలకు నడిచివెళుతున్న విద్యార్థులు. (Sameer Sehgal/HT Photo)
(5 / 7)
పొగ మంచు కారణంగా ముందున్న వాహనాలు సరిగా కనిపించకపోవటంతో ప్రజలు నెమ్మదిగానే వాహనాలను నడుపున్నారు. (Parveen Kumar/HT Photo)
(6 / 7)
ఢిల్లీలోని అక్షరాధామ్ సమీపంలోని 9వ జాతీయ రహదారి వద్ద దట్టమైన పొగ మంచు కమ్మేసిన దృశ్యం. (RajkRaj/HT Photo)
ఇతర గ్యాలరీలు