SBI PO 2023: ఎస్బీఐ పీఓ 2023 ఇంటర్వ్యూ లేటెస్ట్ డీటెయిల్స్ ఇవే..
09 January 2024, 16:33 IST
- SBI PO 2023 Interview: ఎస్బీఐ పీఓ 2023 ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్, సైకోమెట్రిక్ టెస్ట్ లకు సంబంధించిన తేదీలు విడుదలయ్యాయి.
SBI PO 2023: Interview, group exercise, psychometric test tentative dates out
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పీఓ 2023 ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్సైజ్, సైకోమెట్రిక్ టెస్ట్ తాత్కాలిక తేదీలను విడుదల చేసింది. మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలను ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లో చూసుకోవచ్చు.
జనవరి 16 నుంచి..
జనవరి 16 నుంచి ఎస్బీఐ పీఓ (SBI PO 2023) సైకోమెట్రిక్ పరీక్ష ప్రారంభమవుతుంది. అలాగే, జనవరి 21 వ తేదీ నుంచి గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ (At LHO centres) ఉంటాయి. ఫేజ్ 3 కి షార్ట్ లిస్ట్ అయ్యే అభ్యర్థుల పర్సనాలిటీ ప్రొఫైలింగ్ కోసం బ్యాంక్ సైకోమెట్రిక్ టెస్ట్ నిర్వహిస్తుంది. అభ్యర్థులు ఫేజ్-2, ఫేజ్-3 రెండింటిలో విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ (ఫేజ్-2)లో సాధించిన మార్కులను ఫేజ్-3లో సాధించిన మార్కులకు జత చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ను రూపొందిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష (ఫేజ్-1)లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు.
డిసెంబర్ లో పరీక్ష
2023 డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో ఎస్బీఐ పీఓ మెయిన్ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 2000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023, సెప్టెంబర్ 7న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 27న ముగిసింది. ప్రిలిమ్స్ ఫలితాలను 2023 నవంబర్ 21న ప్రకటించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.