SBI PO Recruitment 2023: ఎస్బీఐ పీఓ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇంకా సమయం ఉంది.. మొత్తం 2 వేల పోస్ట్ లు
SBI PO Recruitment 2023: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ (SBI PO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. ఆ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ను పొడిగించారు.
SBI PO Recruitment 2023: ఎస్బీఐ పీఓ (SBI PO) ఉద్యోగాల భర్తీకి లాస్ట్ డేట్ నిజానికి సెప్టెంబర్ 27వ తేదీతో ముగిసింది. కానీ, అభ్యర్థుల నుంచి అభ్యర్థనలు రావడంతో లాస్ట్ డేట్ ను పొడిగించారు.
అక్టోబర్ 3 వరకు ..
స్బీఐ పీఓ (SBI PO) ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీని అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ లోగా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2000 ప్రొబేషనరీ ఆఫీసర్లను ఎస్బీఐ రిక్రూట్ చేస్తోంది.
ఎంపిక ప్రక్రియ
ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ ల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైనవారు పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి. అనంతరం, ఎంపికైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నవంబర్ నెలలో ఉంటుంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్స్ అక్టోబర్ రెండో వారం నుంచి వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.
అర్హత, ఫీజు..
ఎస్బీఐ లో పీఓ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఈయర్ లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ, ఇంటర్వ్యూ సమయానికి వారు డిగ్రీ పూర్తయినట్లుగా సర్టిఫికెట్ చూపాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థులు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులో ఉండాలి. వయో పరిమితిలో రిజర్వేషన్లు వర్తిస్తాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 750 లను పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.