తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Assembly Protests : అసెంబ్లీలో సావర్కర్​ ఫొటో.. విపక్షాల ఆందోళన

Karnataka assembly protests : అసెంబ్లీలో సావర్కర్​ ఫొటో.. విపక్షాల ఆందోళన

19 December 2022, 12:10 IST

google News
    • Protests in Karnataka assembly : కర్ణాటక అసెంబ్లీ హాల్​లో సావర్కర్​ చిత్రపటాన్ని ఆవిష్కరించింది బీజేపీ. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ విపక్షాలు నిరసనకు దిగాయి.
కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్​ చిత్రపటం
కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్​ చిత్రపటం

కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్​ చిత్రపటం

Protests in Karnataka assembly : కర్ణాటక అసెంబ్లీ హాల్​లో సావర్కర్​ చిత్రపటాని అధికార బీజేపీ ఆవిష్కరించడంతో తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ చర్యలకు నిరసనగా విపక్షాలు అసెంబ్లీ బయట తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టాయి.

సావర్కర్​ చిత్రపటం ఎందుకు?

సావర్కర్​పై, హిందుత్వ సిద్ధాంతంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గత కొంతకాలంగా.. రాష్ట్రస్థాయి ప్రచారాలు చేస్తోంది బీజేపీ. వాస్తవానికి.. మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వివాదంలో కీలక పాత్ర పోషిస్తున్న బెళగావికి సావర్కర్​కు ఉంది. 1950లో బెళగావిలోని హిందాల్గా సెంట్రల్​ జైలులో సావర్కర్​ నాలుగు నెలల పాటు ఉన్నారు. ఆయన్ని అరెస్ట్​ చేయాలని ముంబైలో ఆదేశాలు జారీ చేయగా.. ఆ సమయంలో బెళగావిలో ఉన్న సావర్కర్​ను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్​ మాజీ ప్రధాని లియాకత్​ అలీ ఢిల్లీ పర్యటనను అడ్డుకునేందుకు సావర్కర్​ ప్రయత్నిస్తుండటంతో.. ముందస్తు చర్యల భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కోర్టులో సావర్కర్​ కుటుంబసభ్యులు పిటిషన్​ వేయడంతో ఆయన జైలు నుంచి బయటకొచ్చారు.

Savarkar photo in Karnataka Assembly hall : సావర్కర్​పై బీజేపీ ప్రచారాలను విపక్షాలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఇక ఇప్పుడు అసెంబ్లీలో సావర్కర్​ చిత్రపటాన్ని ఆవిష్కరించడంతో నిరసనకు దిగాయి విపక్షాలు.

"చిత్రపటాలను పెట్టడానికి నేను వ్యతిరేకం కాదు. ఎవరిదైనా పెట్టుకోవచ్చు. కానీ అసలమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వ కుట్ర హడావుడి చేస్తోంది. ఇది నిరసన కాదు. సంఘ సంస్కర్తలు, జాతీయ నేతల చిత్రపటాలను కూడా పెట్టాలని(కర్ణాటక అసెంబ్లీ హాల్​లో) మేము డిమాండ్​ చేస్తున్నాము. ఎవరినీ అడగకుండా.. సొంతంగా నిర్ణయం తీసుకుని సావర్కర్​ ఫొటోను పెట్టారు స్పీకర్​. ఇతరుల ఫొటోలు కూడా పెట్టాలని నేను లేఖ రాశాను," అని అసెంబ్లీలో విపక్ష నేత సిద్ధరామయ్య మీడియాకు వెల్లడించారు.

"అసెంబ్లీ కార్యకలాపాలు జరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి చేస్తోంది. వారి అవినీతిని బయటపెడతామన్న భయంతోనే ఫొటో వ్యవహారం తీసుకొచ్చింది. వారికి అభివృద్ధి అజెండాలేవీ లేవు," అని కర్ణాటక కాంగ్రెస్​ చీఫ్​, ఎమ్మెల్యే డీకే శివకుమార్​ ఆరోపించారు.

తప్పేముంది?

Karnataka BJP vs Congress : విపక్షాలు నిరసనలు చేయడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. సావర్కర్​ చిత్రపటాన్ని అసెంబ్లీ హాల్​లో ఏర్పాటు చేయడంలో తప్పేముంది? అని ప్రశ్నిస్తోంది.

"సిద్ధాంతాల మధ్య వ్యత్యాసాలు ఉండొచ్చు. కానీ సావర్కర్​ అనే వ్యక్తి ఓ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఫొటో అసెంబ్లీలో పెడితే తప్పేముంది? ఎవరి ఫొటో పెట్టాలి? అని నేను సిద్ధరామయ్యను ప్రశ్నిస్తున్నాను. దావుద్​ ఇబ్రహీం ఫొటో పెట్టమంటారా?" అని కేంద్రమంత్రి ప్రహ్లాద్​ జోషి వ్యాఖ్యానించారు.

Karnataka Assembly protests : మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సావర్కర్​ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగుతుండటం చర్చలకు దారితీసింది.

తదుపరి వ్యాసం