తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Putin Orders Ceasefire In Ukraine: ఉక్రెయిన్ యుద్ధానికి రెండురోజుల విరామం

Putin orders ceasefire in Ukraine: ఉక్రెయిన్ యుద్ధానికి రెండురోజుల విరామం

HT Telugu Desk HT Telugu

05 January 2023, 22:02 IST

  • Orthodox Christmas: ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల విరామం ప్రకటించారు. ఆర్థొడాక్స్ క్రిస్టమస్ సందర్భంగా పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Reuters)

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

Orthodox Christmas: సంప్రదాయ క్రిస్టమస్ ను రష్యా, తదితర దేశాల్లో జనవరి 6, 7 తేదీల్లో జరుపుకుంటారు. అందువల్ల ఆ రెండు రోజులు యుద్ధానికి విరామం ఇవ్వాలని పుతిన్ నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

Orthodox Christmas: ఆర్థొడాక్స్ క్రిస్టమస్

ఆర్థొడాక్స్ క్రిస్టమస్ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ లు యుద్ధానికి విరామం ఇవ్వాలని రష్యా ఆర్థొడాక్స్ చర్చ్ హెడ్ ఇచ్చిన పిలుపు మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఉక్రెయిన్ మాత్రం ఈ యుద్ధ విరామానికి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఆర్థొడాక్స్ క్రిస్టమస్ పేరుతో యుద్ధానికి విరామం ఇవ్వాలన్నది కుట్రపూరిత నిర్ణయమని ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ ను ట్రాప్ చేసే నిర్ణయమని ఆరోపించింది. సంప్రదాయ క్రిస్టమస్ సందర్భంగా జనవరి 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి 36 గంటల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్లు పుతిన్ ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ లలో, ముఖ్యంగా యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న ప్రాంతాల్లో పెద్ధ సంఖ్యలో ఆర్థొడాక్స్ క్రిస్టియన్లు ఉంటారు. అందువల్ల వారు క్రిస్టమస్ ప్రార్థనల్లో పాల్గొనడానికి, క్రిస్టమస్ పండుగ జరుపుకోవడానికి వీలుగా యుద్ధ విరమణ పాటించాలని నిర్ణయించాం. ఉక్రెయిన్ కూడా యుద్ధ విరమణ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా’ అని పుతిన్ వివరించారు.

టాపిక్