Deadly Ukrainian strike: రష్యాను చావుదెబ్బ తీసిన ఉక్రెయిన్
Deadly Ukrainian strike: రష్యాను ఉక్రెయన్ భారీ దెబ్బ తీసింది. ఉక్రెయిన్ జరిపిన దాడిలో 63 మంది రష్యన్ సైనికులు చనిపోయారని రష్యా స్వయంగా ప్రకటించింది.
Deadly Ukrainian strike: రష్యాను యుద్ధంలో ఉక్రెయిన్ భారీగా దెబ్బ తీసింది. రష్యాపై అనూహ్య రాకెట్ దాడి జరిపి, భారీగా రష్యన్ సైనికుల ప్రాణాలు తీసింది.
Deadly Ukrainian strike: డిసెంబర్ 31న..
డిసెంబర్ 31న రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న దోనెస్క్ ప్రాంతంలోని చిన్న పట్టణం మాకివ్కా(Makiivka) పై ఉక్రెయిన్ ఒక్కసారిగా పెద్ధ ఎత్తున రాకెట్లతో దాడి చేసింది. అమెరికా నుంచి వచ్చిన హిమర్స్ రాకెట్ సిస్టమ్స్(Himars rocket systems) ద్వారా ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. ఈ దాడిలో 400 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ ప్రకటించింది.
Deadly Ukrainian strike: రష్యా స్పందన
ఉక్రెయిన్ జరిపిన దాడిపై రష్యా స్పందించింది. ఉక్రెయిన్ తో యుద్ధంతో రష్యా సైనికుల మరణాల గురించి గత సెప్టెంబర్ లో స్పందించిన రష్యా.. మళ్లీ ఆ విషయమై వివరణ ఇవ్వడం ఇదే ప్రథమం. ఉక్రెయిన్ జరిపిన దాడిలో 63 మంది రష్యన్ సైనికులు చనిపోయారని రష్యా తెలిపింది. ఒక్క దాడిలోనే ఇంతమంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే ప్రథమం. అయితే, సైనికుల మరణాలకు సంబంధించి, ఉక్రెయిన్, రష్యాలు వేర్వేరు సంఖ్యలను ప్రకటించడం గమనార్హం.
Deadly Ukrainian strike: ఇన్ని మరణాలెలా?
ఒకే దాడిలో ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడంపై సైనిక వ్యవహారాల నిపుణులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేసి, రష్యా భారీగా నష్టపోతోందని వారు విశ్లేషిస్తున్నారు. పెద్ధ సంఖ్యలో సైనికులు ఒకే భవనంలో బస చేయడాన్ని తప్పు బడ్తున్నారు. ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో సైనికులు ఉన్న భవనం పూర్తిగా ధ్వంసం కావడానికి కారణం ఆ భవనంలో పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని, పేలుడు పదార్ధాలను కూడా నిల్వ చేయడమేనన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.