Russia Ukraine war : ఉక్రెయిన్​పై రష్యా మిసైళ్ల వర్షం.. న్యూ ఇయర్​ ఆరంభంలోనే!-blasts heard in kyiv around ukraine in early hours of new year s day ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Blasts Heard In Kyiv, Around Ukraine In Early Hours Of New Year's Day

Russia Ukraine war : ఉక్రెయిన్​పై రష్యా మిసైళ్ల వర్షం.. న్యూ ఇయర్​ ఆరంభంలోనే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 01, 2023 07:52 AM IST

Russia attacks Ukraine in New year : సంవత్సరం మారింది కానీ పరిస్థితుల్లో మార్పులు లేవని ప్రపంచానికి హెచ్చరికలు జారీ చేసింది రష్యా! న్యూ ఇయర్​ మొదలైన కొన్ని గంటల్లోనే.. ఉక్రెయిన్​పై మిసైళ్ల వర్షం కురిపించింది!

తన పెంపుడు శునకం, పిల్లితో ఓ ఉక్రెయిన్​ సైనికుడు..
తన పెంపుడు శునకం, పిల్లితో ఓ ఉక్రెయిన్​ సైనికుడు.. (REUTERS)

Russia attacks Ukraine in New year : ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్​ వేడుకలు అంబరాన్ని తాకుతుంటే.. ఉక్రెయిన్​లో మాత్రం మిసైళ్ల మోత మోగిపోయింది! న్యూ ఇయర్​ ఆరంభంలోని మొదటి గంటల్లోనే.. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం మరింత తీవ్రమైంది. ఉక్రెయిన్​పై మిసైళ్లతో దాడులు చేసింది రష్యా. ఫలితంగా.. రాజధాని కీవ్​తో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు అల్లాడిపోయాయి. అయినప్పటికీ ప్రజల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు! ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి 'గ్లోరీ టు ఉక్రెయిన్​', 'గ్లోరీ టు హీరోస్​' అంటూ రష్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉక్రెయిన్​ పౌరులు.

ట్రెండింగ్ వార్తలు

న్యూ ఇయర్​ ఈవ్​ నుంచే..!

కీవ్​లో.. ఓ రష్యా మిసైల్​ను ఉక్రెయిన్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టెమ్​ సమర్థవంతంగా ధ్వంసం చేసింది. అయితే.. ఆ మిసైల్​ శకలాలు..రోడ్డు మీద ఉన్న ఓ కారుపై పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలవ్వలేదని తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన 23 'ఎయిర్​ ఆబ్జెక్ట్స్​'ను ధ్వంసం చేసినట్టు కీవ్​లోని మిలిటరీ యంత్రాంగం ప్రకటించింది.

Russia Ukraine war : వాస్తవానికి శనివారమే ఈ దాడులు మొదలైనట్టు తెలుస్తోంది. 20కిపైగా మిసైళ్లను ఉక్రెయిన్​పై ప్రయోగించింది రష్యా. ఆ పరిణామాలను 'టెర్రర్​ ఆన్​ న్యూ ఇయర్​ ఈవ్​' అని అభివర్ణించారు ఉక్రెయిన్​కు చెందిన హ్యూమెన్​ రైట్స్​ అంబూడ్స్​మన్​ దిమిత్రో లుబినెట్స్​.

రష్యా దాడులను ఉద్దేశించి శనివారం రాత్రి ప్రసంగించారు ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ.

"న్యూ ఇయర్​ ఈవ్​ నాడు.. ప్రజలపై మిసైళ్ల దాడి జరిగింది. ప్రజలపై మిసైల్​ దాడులా? ప్రపంచంలో మిమ్మల్ని(రష్యా) ఎవరు క్షమించరు. ముఖ్యంగా ఉక్రెయిన్​ మిమ్మల్ని క్షమించదు. వారందరు.. తమని తాము క్రీస్టియన్స్​ అని పిలుచుకుంటారు. కానీ వారు దయ్యాలు. వారందరు దయ్యాలతోనే ఉంటారు. మీ ఉగ్రవాద చర్యలను ఎవరు క్షమించరు," అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​పై మండిపడ్డారు జెలెన్​స్కీ.

Russia Ukraine war latest updates : కాగా.. ఉక్రెయిన్​ అధ్యక్షుడు ప్రసంగం ముగిసిన కొద్ది సేపటికే.. మిసైల్​ దాడుల తీవ్రత పెరగడం గమనార్హం. మొత్తం మీద.. న్యూ ఇయర్​ ఈవ్​ నాడు ఉక్రెయిన్​పై రష్యా చేసిన దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది గాయపడ్డారు.

ముగింపు లేని యుద్ధం..!

గతేడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్​ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి ఉక్రెయిన్​లో పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. కానీ యుద్ధం ముగింపు అనేది ఇప్పట్లో జరుగుతుందో లేదో తెలియడం లేదు. ఎక్కడా శాంతి కోసం ప్రయత్నాలు జరగడం లేదు. కనీసం నూతన ఏడాదిలో అయినా.. ఉక్రెయిన్​ పౌరులకు ప్రశాంతత దక్కాలని ప్రపంచ దేశాల ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం