Russia President Putin rules out using nuclear weapons: ‘అణ్వాయుధాలు ప్రయోగించం’
27 October 2022, 22:41 IST
Russia President Putin rules out using nuclear weapons: ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ప్రయోగించే ఆలోచన లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశాడు.
రష్యా అధ్యక్షుడు పుతిన్
ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా అణ్వాయుధం ప్రయోగించాలని ఆలోచిస్తోందన్న వార్త ప్రపంచ దేశాలను కలవరపర్చింది. ఈ విషయంలో భారత్ కూడా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగం ఆలోచన సరికాదని హితవు పలికింది.
Russia President Putin rules out using nuclear weapons: ఆ ఆలోచనే లేదు..
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ప్రయోగించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్ తో ప్రస్తుతం కొనసాగుతున్న మిలటరీ ఆపరేషన్ లో ఆ దేశంపై అణ్వాయుధాలను ప్రయోగించాలన్న ఆలోచన రష్యాకు లేదని ఆయన స్పష్టం చేశారు.
Russia President Putin rules out using nuclear weapons: ఆ అవసరం కూడా లేదు
అంతర్జాతీయ విదేశీ విధాన నిపుణుల(international foreign policy experts) సదస్సులో Putin మాట్లాడుతూ ఉక్రెయిన్ పై అణ్వాయుధ ప్రయోగంపై స్పష్టత ఇచ్చారు. ‘‘ఉక్రెయిన్ పై అణ్వాయుధాలను ప్రయోగించాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయంగా కానీ, మిలటరీ పరంగా కానీ. ఆ ఆలోచనే మాకు లేదు’’ అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించాలన్న అమెరికా, ఇతర పశ్చిమ దేశాల ఆశ వల్లనే ఉక్రెయిన్ సమస్య తలెత్తిందని పుతిన్ వ్యాఖ్యానించారు. వారి ఆశను నెరవేరనివ్వబోనని తేల్చి చెప్పారు.