తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'ఆయుధాలు వీడండి..' ఉక్రెయిన్​ సైనికులకు రష్యా స్ట్రాంగ్​ వార్నింగ్​

'ఆయుధాలు వీడండి..' ఉక్రెయిన్​ సైనికులకు రష్యా స్ట్రాంగ్​ వార్నింగ్​

HT Telugu Desk HT Telugu

19 April 2022, 15:00 IST

google News
    • ఉక్రెయిన్​ సైనికులకు రష్యా మరోమారు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది. ఆయుధాలు వీడి లొంగిపోవాలని పేర్కొంది. అప్పుడు ప్రాణాలతో బ్రతకనిస్తామని స్పష్టం చేసింది.
రష్యా దాడిలో ధ్వంసమైన ప్రాంతం
రష్యా దాడిలో ధ్వంసమైన ప్రాంతం (REUTERS)

రష్యా దాడిలో ధ్వంసమైన ప్రాంతం

Russia Ukraine war | రష్యా ఉక్రెయిన్​ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా.. ఉక్రెయిన్​ సైనికులకు రష్యా స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోవాలని తేల్చిచెప్పింది. భీకర పోరాటం జరుగుతున్న మారియుపోల్​లోని ఉక్రెయిన్​ బలగాలను ఉద్దేశించి రష్యా ఈ ప్రకటన చేసింది.

"ఉక్రెయిన్​ దళాలు అర్థం లేని విధంగా పోరాటం చేస్తున్నాయి. వాటిని వెంటనే ఆపాలని ఉక్రెయిన్​ అధికారులు.. సైనికులకు చెబితే మంచిది. కానీ ఇలాంటి సూచనలు ఉక్రెయిన్​ అధికారులు చెయ్యరని మాకు తెలుసు. అందుకే.. సైనికులే స్వచ్ఛందంగా ఆయుధాలు వీడాలని, లొంగిపోవాలని మేము చెబుతున్నాము," అని రష్యా రక్షణశాఖ.. మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

తూర్పు ఉక్రెయిన్​లోని డాన్​బాస్​ ప్రాంతంలో రష్యా దాడులు మొదలుపెట్టిందని ఉక్రెయిన్​ ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశం ఇలాంటి ప్రకటనను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మారియుపోల్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రష్యా దళాల చేతులో ఉక్రెయిన్​ సైనికులు ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయమని ఆ దేశ రక్షణశాఖ అభిప్రాయపడింది. అందువల్ల.. సైనికులు ఆయుధాలను వీడితే మంచిదని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొంది. ఆయుధాలు వీడితే.. వదిలేస్తామని, బ్రతకనిస్తామని హామీనిచ్చింది.

టాపిక్

తదుపరి వ్యాసం