Ukraine | 10రోజుల వ్యవధిలో.. ఇద్దరు బిడ్డలకు ఖననం చేసిన తల్లి-ukraine mother buried both of her sons just ten days apart ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine | 10రోజుల వ్యవధిలో.. ఇద్దరు బిడ్డలకు ఖననం చేసిన తల్లి

Ukraine | 10రోజుల వ్యవధిలో.. ఇద్దరు బిడ్డలకు ఖననం చేసిన తల్లి

HT Telugu Desk HT Telugu
Apr 18, 2022 09:33 PM IST

ఉక్రెయిన్​: రష్యా ఉక్రెయిన్​ యుద్ధంలో ఎన్నో హృదయ విదారక వార్తలు ప్రపంచ దేశాలను కుదిపేస్తున్నాయి. తాజాగా.. ఓ తల్లి.. 10 రోజుల వ్యవధిలో తన ఇద్దరు కుమారులకు ఖననం చేసింది. ఈ వార్త అందరికి కంటతడి పెట్టిస్తోంది.

<p>బిడ్డలకు ఖననం చేసిన తల్లి</p>
బిడ్డలకు ఖననం చేసిన తల్లి (TWITTER)

Russia Ukraine war | యుద్ధ విచ్ఛిన్న దేశం ఉక్రెయిన్​ నుంచి ఎన్నో హృదయ విదారక కథలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి.. 10రోజుల వ్యవధిలో తన ఇద్దరు బిడ్డలను ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వీర సైనికులకు వందనం..

ఆ తల్లి పేరు అహాఫియా వ్యశ్య్వన. ఆమెకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ ఉక్రెయిన్​ సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్​ యుద్ధంతో సైనికులకు పని ఎక్కువైంది. రష్యా దాడిలో చాలామంది ఉక్రెయిన్​ సైనికులు మరణించారు. వారిలో వ్యశ్య్వన కుమారులు వాసిల్​, కైరిలో కూడా ఉన్నారు.

రష్యా దాడిలో గత నెల 3న.. వాసిల్​(28) ప్రాణాలు కోల్పోయాడు. కాగా అదే నెల 13న అతని సోదరుడు, వ్యశ్య్వన పెద్ద కుమారుడు కైరిలో(35).. రష్యా మిసైల్​కు బలయ్యాడు. వీరి అంత్యక్రియలు డులుబై అనే గ్రామంలో జరిగింది. 10రోజుల వ్యవధిలో మరణించిన సోదరులకు.. ఖననం చేసింది ఆ తల్లి. వీరి అంత్యక్రియలకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్​కు అనుకూలంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. వారి నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి. ఈ దృశ్యాలను స్థానిక జర్నలిస్ట్​ చిత్రీకరించాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్​ చేశాడు. తన జీవితంలోనే హృదయవిదారక ఘటన అంటూ రాసుకొచ్చాడు.

ఇంత కష్టమొచ్చినా.. ఆ తల్లి బాధపడలేదు. సైనికుల తల్లిలాగే ప్రవర్తించింది. తన కుమారులు.. దేశం కోసం ప్రాణత్యాగం చేశారని కొనియాడింది.

ఉక్రెయిన్​ సైనికుల ధైర్యసాహసాల గురించి ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. రష్యాను ఎదురించి నిలుస్తున్న వారికి ప్రపంచ దేశాల ప్రజలు సెల్యూట్​ చేస్తున్నారు. ఉక్రెయిన్​కు శక్తి లభించాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్