Reliance results Q1 2022 : రిలయన్స్ లాభాల జోరు.. కానీ అంచనాలు మిస్!
23 July 2022, 9:16 IST
Reliance results Q1 2022 : 2022 తొలి త్రైమాసికంలో రిలయన్స్ లాభాలు మెరుగుపడ్డాయి. కానీ అవి అంచనాలను అందుకోలేకపోయాయి!
రిలయన్స్ లాభాల జోరు.. కానీ అంచనాలు మిస్!
Reliance results Q1 2022 : రిలయన్స్ ఇండస్ట్రీస్.. 2022 తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. రిఫైనింగ్ మార్జిన్ల వృద్ధితో ప్రాఫిట్ 46శాతం పెరిగింది. కానీ.. ముడిసరకు ధరలు పెరగడంతో నిపుణుల అంచనాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ అందుకోలేకపోయింది.
జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం రూ. 17,955కోట్లుగా నమోదైంది. కాగా.. అంచనాలు మాత్రం రూ. 22,920కోట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం రూ. 12,273కోట్లుగా వచ్చింది.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రెవెన్యూ 55శాతం పెరిగి. రూ. 2.23ట్రిలియన్కు చేరింది. కానీ.. అదే సమయంలో మొత్తం ఖర్చులు 51శాతం పెరిగి.. రూ. 1.98ట్రిలియన్కు వెళ్లింది. ఇందులో 76శాతం వాటా ముడిసరకు ధరలదే!
ద్రవ్యోల్బణంతో సవాళ్లు ఎదురైనా.. రిలయన్స్లోని అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనే చేశాయి. ముఖ్యంగా రిటైల్ విభాగం.. ఏడాది క్రితంతో పోల్చుకుంటే 52శాతం మెరుగుపడింది. ఆయిల్ టు కెమికల్స్ విభాగం రెవెన్యూ 11శాతం పెరిగి రూ. 1,61,715కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ 40శాతం వృద్ధిచెందింది.
రిలయన్స్ వ్యాపారాల్లో అన్నింటికన్నా.. చమురు రిఫైనింగ్ లాభాలు ఈ త్రైమాసికంలో దూసుకెళ్లాయి. సింగపూర్ జీఆర్ఎం(గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్) బ్యారెల్కు 21.4డాలర్లు పెరిగింది. అంతకుముందు త్రైమాసికంలో అది 8డాలర్లుగా ఉండటం గమనార్హం. రిఫైనింగ్ సెగ్మెంట్లో జీఆర్ఎంతో రిలయన్స్ ఆదాయం పొందుతుంది.
కాగా.. ఈ అండ్ పీ వ్యాపారంలో రెవెన్యూ మూడు రెట్లు పెరిగి రూ. 3,625కోట్లకు చేరింది.
ఇక రిలయన్స్ జియో నికర లాభం 24శాతం పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.