Reliance Jio Q1 Results: 24 శాతం పెరిగిన రిలయన్స్ జియో నికర లాభం-reliance jio reports 24 percent rise in quarterly profit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Reliance Jio Q1 Results: 24 శాతం పెరిగిన రిలయన్స్ జియో నికర లాభం

Reliance Jio Q1 Results: 24 శాతం పెరిగిన రిలయన్స్ జియో నికర లాభం

HT Telugu Desk HT Telugu
Jul 22, 2022 05:35 PM IST

RELIANCE JIO-RESULTS: రిలయన్స్ జియో తొలి క్వార్టర్‌లో నికర లాభంలో పెరుగుదలను చూపింది.

తండ్రి ముఖేష్ అంబానీతో జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ
తండ్రి ముఖేష్ అంబానీతో జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ (PTI)

బెంగళూరు: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో తన క్వార్టర్లీ రిజల్ట్స్‌లో నికర లాభం 24 శాతం పెరిగినట్టు తెలిపింది.

చందాదారుల సంఖ్య కూడా పెరిగిందని వెల్లడించింది. జూన్ 30తో ముగిసిన ఫస్ట్ క్వార్టర్‌లో 4345 కోట్ల రూపాయల మేర నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో నికర లాభం రూ. 3501 కోట్లుగా ఉంది.

బంధన్ బ్యాంక్ లాభం రెండింతలు

మొండి బకాయిల క్షీణత కారణంగా ఏప్రిల్-జూన్ 2022-23 త్రైమాసిక నికర లాభం రెండింతలు పెరిగి రూ. 886.5 కోట్లకు చేరుకుందని బంధన్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది.

కోల్‌కతా ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రైవేట్ రంగ బ్యాంక్ గత ఏడాది ఇదే కాలంలో రూ. 373.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

మొత్తం ఆదాయం రూ. 2,731 కోట్ల నుంచి రూ.2,844.1 కోట్లకు పెరిగింది. రుణదాత వడ్డీ ఆదాయం రూ. 2,114.1 కోట్ల నుండి రూ. 2,514.4 కోట్లకు పెరిగిందని బంధన్ బ్యాంక్‌లో తెలిపింది.

స్థూల నిరర్థక ఆస్తులు (NPAలు) తగ్గినందున ఆస్తి నాణ్యత విషయంలో పనితీరు మెరుగుపడింది. నికర ఎన్‌పీఏ కూడా ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో 3.29 శాతం నుంచి 1.92 శాతానికి తగ్గింది.

IPL_Entry_Point

టాపిక్