తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Sudarshan V HT Telugu

07 November 2024, 19:30 IST

google News
  • Supreme Court: కె.మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర కేసులో 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఎంపిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంపిక ప్రమాణాలను మార్చడం కుదరదని గురువారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది.

 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Government Jobs Recruitment: ప్రభుత్వ నియామకాలు పారదర్శకంగా, ఏకపక్షంగా జరగాలంటే నియామక ప్రక్రియ మధ్యలో ఎంపిక నిబంధనలను మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ వివిధ దశలలో బెంచ్ మార్క్ లను సెట్ చేయడానికి నిబంధనలు అనుమతిస్తే, ఆ దశ రాకముందే అవి తప్పనిసరిగా అమలులో ఉండాలని తెలిపింది.

రాజ్యాంగ ధర్మాసనం తీర్పు

2008లో కే మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఎంపిక ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంపిక ప్రమాణాలను మార్చడం కుదరదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 2013లో తేజ్ ప్రకాశ్ పాఠక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో రాజస్థాన్ న్యాయవ్యవస్థలో 13 మంది అనువాదకుల నియామకానికి సంబంధించి ఇచ్చిన తీర్పులో ఈ ప్రస్తావన వచ్చింది.

రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా

జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, పంకజ్ మిథాల్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం 'నియామక ప్రక్రియ ప్రకటనల జారీతో ప్రారంభమై ఖాళీల భర్తీతో ముగుస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు అనుమతిస్తే తప్ప అర్హత నిబంధనలను మధ్యలోనే మార్చడానికి వీల్లేదు. నిబంధనలు అటువంటి మార్పును అనుమతించినప్పటికీ, అది ఏకపక్షంగా ఉండకూడదు. అలాగే, ఆర్టికల్ 14 (సమానత్వం), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్ష లేకుండా) కింద నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి’’ అని రాజ్యంగ ధర్మాసనం స్పష్టంగా వివరించింది.

నిబంధనలు పారదర్శకంగా ఉండాలి

నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు పారదర్శకంగా, వివక్ష లేకుండా, ఏకపక్షంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఎంపిక జాబితాలో అభ్యర్థికి స్థానం కల్పించినంత మాత్రాన ఉద్యోగ హక్కు ఉండదని పేర్కొంది. కానీ, ఒకవేళ ఖాళీలు ఉంటే, ఎంపిక జోన్ పరిధిలో అభ్యర్థులకు నియామకాన్ని ప్రభుత్వం నిరాకరించజాలదని ధర్మాసనం పేర్కొంది. భర్తీ చేసే పోస్టుకు తగిన ప్రమాణాలను రూపొందించే బాధ్యత సబంధిత యాజమాన్యానికే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

బెంచ్ మార్క్ లను సెట్ చేసుకోవచ్చు..

‘‘ఆర్టికల్ 14, 16లకు లోబడి ఉద్యోగానికి తగిన ప్రమాణాలను యజమాని రూపొందించాలి. అపాయింట్ మెంట్ అథారిటీ విధివిధానాలను రూపొందించి వివిధ దశల రిక్రూట్ మెంట్ కు బెంచ్ మార్క్ లను సెట్ చేయవచ్చు. నియామక ప్రక్రియకు ముందు లేదా ఆ దశకు చేరుకోకముందే ఇలాంటి నిబంధనలను నిర్ణయించాలి, తద్వారా బెంచ్ మార్క్ లను నిర్ణయించవచ్చు" అని ధర్మాసనం తెలిపింది. ఇలాంటి సూత్రం నిరంకుశత్వాన్ని నిరోధిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగాల్లో (government jobs) పారదర్శకతను పెంపొందిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

తదుపరి వ్యాసం