తెలుగు న్యూస్  /  National International  /  Record 35 Lakh Pilgrims Arrived In Haridwar On Somvati Amavasya

Somvati Amavasya | సోమవతి అమావాస్య వేళ హరిద్వార్​కు పోటెత్తిన భక్తులు..

HT Telugu Desk HT Telugu

30 May 2022, 17:11 IST

    • Somvati Amavasya | ఉత్తరాఖండ్​ హరిద్వార్​ వీధులు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. సోమవతి అమావాస్య సందర్భంగా.. రికార్డు స్థాయిలో 35లక్షల మంది భక్తులు హరిద్వార్​ను సందర్శించారు!
భక్తులతో కిక్కిరిసిన గంగా ఘాట్​లు
భక్తులతో కిక్కిరిసిన గంగా ఘాట్​లు (RAMESHWAR GAUR/HT PHOTO)

భక్తులతో కిక్కిరిసిన గంగా ఘాట్​లు

Somvati Amavasya | సోమవతి అమావాస్య సందర్భంగా.. ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. రెండేళ్ల కొవిడ్​ అంతరాయం అనంతరం.. సోమవతి అమావాస్య జరుగుతుండటంతో గంగా ఘాట్​లలో రికార్డుస్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.

ట్రెండింగ్ వార్తలు

Crime news : 8ఏళ్ల బాలిక రేప్​- హత్య.. నిందితుడి వయస్సు 13ఏళ్లు!

Prajwal Revanna : కర్ణాటకను కుదిపేస్తున్న సెక్స్​ కుంభకోణం.. దేశాన్ని విడిచి వెళ్లిపోయిన రేవన్న!

Lok Sabha election : మొబైల్​ నెంబర్​తో మీ పోలింగ్​ స్టేషన్​ లొకేషన్​ని ఇలా తెలుసుకోండి..

Prachi Nigam : 'చాణక్యుడిని కూడా..'- ట్రోల్స్​పై స్పందించిన యూపీ క్లాస్​ 10 టాపర్​

మేళా కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్​ రూమ్​ ప్రకారం.. దేశ నలుమూలల నుంచి 35లక్షలకుపైగా మంది భక్తులు హరిద్వార్​కు వెళ్లారు. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు.. భ్రహ్మకుండ్​, హర్​కీపౌరిలను దర్శించుకుంటున్నారు.

<p>గంగా ఘాట్​ వద్ద సాధువు</p>

ఉదయం 10 గంటల వరకు.. ఏకంగా 22లక్షల మంది భక్తులు గంగా నదిలో స్నానాలు చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇదే రికార్డు. కాగా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. గంగా సభ కమిటీ సభ్యులు.. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఆ ప్రాంతం అంతటా వాలెంటీర్లను ఏర్పాటు చేశారు.

"రెండేళ్ల కొవిడ్​ సంక్షోభం అనంతరం.. ఈసారి సోమవతి అమావాస్యకు భక్తులు భారీగా తరలివచ్చారు. హర్​కిపౌరికి వెళ్లే రోడ్లు అన్ని కిటకిటలాడిపోతున్నాయి," అని ధర్మశాల సమితి ప్రధాన కార్యదర్శి వికాస్​ తివారి వెల్లడించారు.

భారీ భద్రతా ఏర్పాట్లు..

హరిద్వార్​కు భక్తులు పోటెత్తడంతో.. ఎన్​హెచ్​-58 వద్ద తీవ్ర ట్రాఫిక్​ జామ్​ నెలకొంది. వాహనాలు అనేక గంటలపాటు ముందుకు కదలలేని పరిస్థితి.

Haridwar Somvati Amavasya | భక్తుల తాకిడితో హరిద్వార్​లోని హోటళ్లు, ధర్మశాలలు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్లు, రూమ్​ల కొరత తీవ్రంగా ఉందని సమాచారం.

<p>హరిద్వార్​కు తరలివెళ్లిన భక్తులు</p>

సోమవతి అమావాస్య సందర్భంగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అధికారులు తగిన చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యల్లో పోలీసులను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో స్నిఫర్​ డాగ్స్​ చేత తనిఖీలు చేయిస్తున్నారు.

టాపిక్