తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hanuman Jayanti 2022 | భయం వేసినా.. బాధ కలిగినా.. రక్షించే వాడు హనుమంతుడే..

Hanuman Jayanti 2022 | భయం వేసినా.. బాధ కలిగినా.. రక్షించే వాడు హనుమంతుడే..

HT Telugu Desk HT Telugu

16 April 2022, 12:15 IST

    • హనుమాన్ చాలీసా చదవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని హిందువులు విస్తృతంగా నమ్ముతారు. చాలా మంది భయం వేసినా.. ఏదైనా పని చేసుకునే ముందు.. ధైర్యం కోసం హనుమాన్ చాలీసాను చదువుతారు. దీనిని ఎవరైనా చదవచ్చు. ఉదయం స్నానం చేసిన తర్వాత, సూర్యాస్తమయం తర్వాత దీనిని చదవొచ్చు. హనుమాన్ జయంతి సందర్భంగా చాలీసా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమాన్ జయంతి
హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

Hanuman Jayanti 2022 | హనుమాన్ చాలీసా అనేది శ్రీరాముని భక్తుడైన హనుమంతునికి అంకితం చేసిన 40 కవితా పంక్తుల సమూహారం. తులసీదాస్‌ను మొఘల్ పాలకుడు ఔరంగజేబు జైలులో ఉంచినప్పుడు దీనిని రాశాడు. తనకు స్వామిని చూపించమని ఔరంగజేబు సవాలు చేసినప్పుడు.. రాముడిని నిజమైన భక్తితో మాత్రమే చూడగలరని తులసీదాస్ సమాధానమివ్వగా.. అది చక్రవర్తికి కోపం తెప్పించింది. దీంతో తులసీదాస్​ను చెరసాలలో బంధించాడు. జైలులో తులసీదాస్ తన పద్యం రాసి.. దానిని పఠించినప్పుడు.. వానరుల సైన్యం దిల్లీపై దాడి చేసిందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అందుకే చాలా మంది తమకు మంచి జరుగుతుందని హనుమాన్ చాలీసాను చదువుతారు.

ట్రెండింగ్ వార్తలు

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

Bad Food Combinations: ఆయుర్వేదం ప్రకారం తినకూడని ఫుడ్ కాంబినేషన్లు ఇవే

హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు..

* సమస్యలను పరిష్కరించడంలో, దుష్టశక్తులు, ప్రతికూల శక్తులను దూరం చేయడంలో హనుమంతుని సహాయాన్ని పొందేందుకు హనుమాన్ చాలీసాను పఠిస్తారు.

* శాంతి, శ్రేయస్సు కోసం శనివారం హనుమాన్ చాలీసాను చదివితే.. శని ప్రభావాలను తగ్గించవచ్చు.

* నిద్రపోయే ముందు హనుమాన్ చాలీసాను దిండు కింద ఉంచితే.. పీడకలల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* హనుమాన్ చాలీసా అంకితమైన పారాయణాలు అన్నింటికంటే భయంకరమైన సంఘటనల వల్ల కలిగే గాయాన్ని అధిగమించడంలో సహాయపడతాయి.

* గతంలో చేసిన తప్పుల కర్మ పరిణామాల నుంచి విముక్తి పొందాలనుకుంటే, హనుమాన్ చాలీసాను చదవచ్చు.

* హనుమాన్ చాలీసాను భక్తితో చదివేవారు హనుమంతుని స్వర్గ రక్షణను స్వాగతిస్తారు. ఇది మన ప్రయత్నాలలో అడ్డంకులను తొలగిస్తుంది.

* ఒత్తిడికి లోనవుతున్న వారు హనుమాన్ చాలీసాను చదవడం ద్వారా వారి జీవితాలను సులభంగా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.

* చాలా మంది హనుమంతుడు ప్రమాదాలను నివారించగలడని, సురక్షితమైన ప్రయాణాన్ని ఇస్తాడని భావిస్తారు. అందుకే వారు తమ వాహనాలపై హనుమాన్ విగ్రహాలను ఉంచుతారు.

* జ్ఞానోదయం కోరుకునే వ్యక్తులకు, అంతర్దృష్టి, ఆధ్యాత్మిక అవగాహనను పొందడంలో సహాయపడుతుంది.

* పక్కదారి పట్టిన వ్యక్తులు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. చెడు అలవాట్ల బారిన పడిన వ్యక్తుల పునరావాసంలో ఇది సహాయపడుతుంది.

* వైరుధ్యాలను తొలగించి.. ఏకాభిప్రాయం, సంతృప్తిని ఇస్తుంది. అనవసర వివాదాలు తొలగిపోతాయి.

మీరు కూడా హనుమంతుని నమ్మితే.. మీకు నచ్చిన సమయంలో.. అవసరమైన సమయంలో.. ధైర్యం కావాలనుకున్నప్పుడు హనుమాన్ చాలీసాను చదివేయండి.

టాపిక్

తదుపరి వ్యాసం