తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Republic Day 2024 : 'రిపబ్లిక్​ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

Republic day 2024 : 'రిపబ్లిక్​ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

Sharath Chitturi HT Telugu

23 January 2024, 11:38 IST

    • Republic day 2024 : రిపబ్లిక్​ డేని జనవరి 26వ తేదీనే ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న చరిత్ర మీకు తెలుసా?
'రిపబ్లిక్​ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటామో తెలుసా?
'రిపబ్లిక్​ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

'రిపబ్లిక్​ డే'ని జనవరి 26నే ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

Republic day 2024 : 75ఏవ రిపబ్లిక్​ డే కోసం భారత దేశం సిద్ధమవుతోంది. దిల్లీ వీధుల్లో ఇప్పటికే గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. రిపబ్లిక్​ డే ని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? జనవరి 26న, భారత రాజ్యంగం అమల్లోకి రావడంతో రిపబ్లిక్​ డేని జరుపుకుంటాము. కానీ.. జనవరి 26నే ఎందుకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది? జనవరి 26నే ఎందుకు ఎంచుకున్నారు? ఇక్కడ తెలుసుకుందాము రండి..

గణతంత్ర్య దినోత్సవం.. జనవరి 26 చరిత్ర..

1947 ఆగస్ట్​ 15న ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని అప్పటికే చాలా మంది పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగాన్ని నిర్మించేందుకు.. ఆగస్ట్​ నెల చివర్లో.. బీఆర్​ అంబేడ్కర్​ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగాన్ని నిర్మించేందుకు ఈ కమిటీ ఎంతో కృషి చేసింది. రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2ఏళ్ల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. చివరికి.. 1949 నవంబర్​ 26న.. రాజ్యాంగాన్ని అడాప్ట్​ చేసుకున్నారు. అందుకే.. ఆరోజును ప్రతియేట.. 'రాజ్యాంగ దినోత్సవం'గా గుర్తు చేసుకుంటాము.

Why is republic day celebrated on January 26 : 1949 నవంబర్​ 26 రాజ్యాంగాన్ని అడాప్ట్​ చేసుకున్నారు కానీ.. దానిని అమలు చేయలేదు. ఎప్పుడు అమలు చేద్దాము? అని ఆలోచిస్తుండగా.. అప్పటి రాజకీయ పెద్దలకు తట్టిన తేదీ.. 'జనవరి 26'. ఇందుకు ఓ ముఖ్య కారణం కూడా ఉంది.

అది 1930.. బ్రిటీష్​ పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ (ఐఎన్​సీ) తీవ్రంగా పోరాడుతున్న రోజులవి. 1930 జనవరి 26న.. తొలిసారిగా పూర్ణ స్వరాజ్​ (సంపూర్ణ స్వాతంత్ర్యం) నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్​. దేశ చరిత్రలో అదొక కీలక ఘట్టంగా భావిస్తూ ఉంటారు.

అందుకే.. 20ఏళ్ల తర్వాత.. అంటే, జనవరి 26, 1950న రాజ్యాంగాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అలా.. 1950, జనవరి 26వ తేదీన.. భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇండియా.. రిపబ్లిక్​ నేషన్​గా అవతరించింది. ఇండియా.. సావరిన్​, డెమొక్రటీక్​, రిపబ్లిక్​ నేషన్​గా మారింది.

అట్టహాసంగా సంబరాలు..

Republic ay 2024 latest news : అప్పటి నుంచి ప్రతియేటా గణతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఊరూ, వాడ.. అందరు మువ్వన్నెల జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. పంద్రాగస్టు తర్వాత.. దేశంలో జరిగే ముఖ్యమైన ఈవెంట్స్​లో ఈ గణతంత్ర్య దినోత్సవం ఒకటి.

దిల్లీలో కోలాహలం వర్ణణాతీతంగా ఉంటుంది. గణతంత్ర్య దినోత్సవం రోజు.. భారత ప్రథమ పౌరులు రాష్ట్రపతి.. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం.. రిపబ్లిక్​ డే పరేడ్​ జరుగుతుంది. ఆ తర్వాత.. ధైర్యసాహాసలు కనబర్చి, ప్రత్యేకంగా నిలిచిన వారికి అవార్డులు ఇస్తారు.

తదుపరి వ్యాసం