JIO republic day offers : జియో రిపబ్లిక్ డే క్రేజీ ఆఫర్- మీకు యూజ్ అవుతుంది చూడండి..
JIO republic day offers : మీరు జియో వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే! రిపబ్లిక్ డే సందర్భంగా.. క్రేజీ ఆఫర్‌ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఆ వివరాలు..
JIO republic day offer : ప్రత్యేక ఆఫర్స్‌తో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. న్యూ ఇయర్ నేపథ్యంలో ఇటీవలే అదిరిపోయే ఆఫర్స్ ని ప్రకటించిన జియో.. ఇప్పుడు రిపబ్లిక్ డేపై ఫోకస్ చేసింది. తాజాగా ఓ క్రేజీ ఆఫర్‌ని కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో.. ఈ జియో రిపబ్లిక్ డే ఆఫర్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
జియో రిపబ్లిక్ డే ఆఫర్..
రూ. 2999 యాన్యువల్ ప్లాన్‌పై ఈ రిపబ్లిక్ డే ఆఫర్‌ని ప్రకటించింది జియో. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, పలు ఎగ్జైటింగ్ ఆఫర్స్‌ని ఇస్తోంది. ఆఫర్లో భాగంగా.. ఏజియో, టిరా, ఎక్సిగో, స్విగ్గీ, రిలయన్స్ డిజిటల్‌పై ఆకర్షణీయమైన ఆఫర్స్ కనిపిస్తున్నాయి.
ఏజియో- రూ. 2,499 విలువ చేసే కొనుగోళ్లపై రూ. 500 తగ్గింపు.
టిరా- రూ. 1000 వరకు 30శాతం తగ్గింపు.
JIO republic day offer 2024 : ఎక్సిగో- ఫ్లైట్ టికెట్స్‌పై రూ. 1500 వరకు తగ్గింపు.
స్విగ్గీ- 2 ఫుడ్ డెలివరీ కూపన్స్. మొత్తం మీద రూ. 250 తగ్గింపు
రిలయన్స్ డిజిటల్- రూ. 5వేలు విలువ చేసే కొనుగోళ్లపై 10శాతం వరకు తగ్గింపు.
జియో రిపబ్లిక్ డే ఆఫర్- ఇవి తెలుసుకోండి..
రూ. 2,999 ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకున్న తర్వాత.. ఈ పార్ట్నర్ కూపన్లు.. మీ మైజియో కౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. వాటిల్లోని కోడ్స్‌ని కాపీ చేసుకుని, పార్ట్నర్ యాప్స్/ వెబ్‌సైట్స్‌లో అప్లై చేసుకుంటే తగ్గింపు లభిస్తుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మైజియో యాప్‌లో ఉంటాయి. ఈ కూపన్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్పైరీ డేట్‌కి ముందే రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కూపన్‌కు వాలిడిటీ డేట్ ఉంటుంది. ఆ వివరాలను కూడా చూసుకోవాలి.
Reliance Jio 2999 plan : కాగా.. ఈ జియో రిపబ్లిక్ డే ఆఫర్.. జనవరి 15 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుంది. అంటే.. ఈ లోపు, రూ. 2999 ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ లభిస్తుంది.
జియో రూ. 2999 యాన్యువల్ ప్యాక్..
ఈ జియో రూ. 2999 యాన్యువల్ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల పాటు ఫ్రీ, అన్లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. మొత్తం మీద 912.5 జీబీ డేటా వస్తుంది. అంటే రోజుకు 2.5 జీబీ డేటా పొందుతున్నట్టు! రోజుకు 100 మెసేజ్‌లు చేసుకోవచ్చు. జియోసినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ వంటి రిలయన్స్ జియో యాప్స్‌ని కూడా పొందవచ్చు.
పూర్తి వివరాల కోసం మైజియో యాప్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం