Amazon Republic Day Sale: రేపటి నుంచి ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్; ఈ ప్రొడక్ట్స్ పై బెస్ట్ ఆఫర్స్-amazon republic day sale 2024 starts january 13 sneak peek into top deals ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amazon Republic Day Sale: రేపటి నుంచి ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్; ఈ ప్రొడక్ట్స్ పై బెస్ట్ ఆఫర్స్

Amazon Republic Day Sale: రేపటి నుంచి ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్; ఈ ప్రొడక్ట్స్ పై బెస్ట్ ఆఫర్స్

HT Telugu Desk HT Telugu
Jan 12, 2024 02:26 PM IST

Amazon Republic Day Sale: 2024 లో తొలి డిస్కౌంట్ సేల్ ను ఆమెజాన్ ప్రారంభించనుంది. జనవరి 13వ తేదీ నుంచి ఆమెజాన్ లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం అవుతోంది. ఈ సేల్ లో దాదాపు అన్ని ప్రొడక్ట్స్ పై గొప్ప తగ్గింపు ఆఫర్లను ఆమెజాన్ అందిస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pexels)

Amazon Republic Day Sale: ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 నుండి మొదలై జనవరి 18 వరకు కొనసాగుతుంది. ఆమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్ షిప్ ఉన్నవారికి ఈ సేల్ ముందుగానే ప్రారంభమవుతుంది. జనవరి 13, 12:00 A.M కి (జనవరి 12 అర్థరాత్రి నుంచి) ఆమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ ప్రారంభం అవుతుంది. అలాగే, జనవరి 13, మధ్యాహ్నం 12 నుండి అందరికీ ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి.

ఎలక్ట్రానిక్స్ పై..

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Republic Day Sale) లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అప్లయన్సెస్ పై భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ. 40,000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది ప్రొఫెషనల్స్ కు, స్టూడెంట్స్ కు ఉపయోగకరం. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై గరిష్టంగా 40% తగ్గింపు లభిస్తుంది. అలాగే, హెడ్‌ఫోన్‌లపై 75% వరకు తగ్గింపు, స్పీకర్‌లు, సౌండ్‌బార్‌లపై 70% వరకు తగ్గింపును పొందవచ్చు.

కెమెరాలపై..

ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Republic Day Sale) లో కెమెరాలపై 30% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. తమ డిజిటల్ స్టోరేజీని విస్తరించుకోవాలని చూస్తున్న వారికి, మెమొరీ కార్డ్‌లు, పెన్ డ్రైవ్‌లపై గరిష్టంగా 70% తగ్గింపు, అలాగే టాప్ SSDలపై 60% వరకు తగ్గింపు ఆఫర్‌లు ఉన్నాయి. ప్రింటర్‌లు 50% వరకు తగ్గింపుతో లభిస్తాయి. స్మార్ట్‌వాచ్‌ కొనాలన్నా లేదా మీ స్మార్ట్ వాచ్ ను అప్‌గ్రేడ్ చేయాలనుకున్నా. బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లు దాదాపు 80% డిస్కౌంట్ తో కేవలం రూ. 899 రూపాయల ఆకర్షణీయమైన ధరతో ప్రారంభమవుతాయి.

బ్యాంక్ ఆఫర్స్

ఈ ఆమెజాన్ రిపబ్లిక్ సేల్ లో ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసేవారు ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తే, మరింత డిస్కౌంట్ పొందవచ్చు. ఎస్బీఐ (SBI) క్రెడిట్ కార్డ్‌, లేదా SBI కార్డ్ EMI లావాదేవీల ద్వారా చేసిన చెల్లింపులపై 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. అర్హత కలిగిన ఉత్పత్తులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI ఆప్షన్స్ కూడాఉన్నాయి.

ప్రైమ్ మెంబర్ షిప్

ఈ ఆమెజాన్ రిపబ్లిక్ డే సేల్ మిగతావారి కన్నా ముందే యాక్సెస్ చేయాలనుకుంటే ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవడం మంచిది. ఈ మెంబర్ షిప్ ద్వారా ఆమెజాన్ అందిస్తున్న పలు బెనిఫిట్స్ ను పొందవచ్చు. వాటిలో ఫ్రీ వన్ డే డెలివరీ, ప్రైమ్ వీడియో, ఆమెజాన్ మ్యూజిక్ వంటి సౌలభ్యాలు ఉన్నాయి. వినియోగదారులు Amazon వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా, నెలవారీ, వార్షిక సభ్యత్వ ఎంపికలతో ప్రైమ్ మెంబర్ షిప్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు.

WhatsApp channel