తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi In New Look: గడ్డం ట్రిమ్ చేసి.. కొత్త లుక్ లో రాహుల్ గాంధీ..

Rahul Gandhi in New look: గడ్డం ట్రిమ్ చేసి.. కొత్త లుక్ లో రాహుల్ గాంధీ..

HT Telugu Desk HT Telugu

01 March 2023, 15:40 IST

google News
  • Rahul Gandhi in New look: భారత్ జోడో యాత్రకు ముందు రాహుల్ గాంధీ లుక్ గడ్డం లేకుండా క్లీన్ షేవ్ లోనో లేక, చిన్న గడ్డంతోనో ఉండేది. 

కొత్త లుక్ లో రాహుల్ గాంధీ
కొత్త లుక్ లో రాహుల్ గాంధీ

కొత్త లుక్ లో రాహుల్ గాంధీ

Rahul Gandhi in New look: భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డం షేవ్ చేసుకోవడం ఆపేశారు. పెరిగిన గడ్డంతోనే భారత్ జోడో యాత్ర కొనసాగించారు. భారత్ జోడో యాత్ర పర్యంతం ఇటు మెయిన్ మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోను, చివరకు రాజకీయ వర్గాల్లోనూ రెండు విషయాలపై ప్రధానంగా చర్చ సాగింది. అవి గడ్డ కట్టించే చలిలోనూ సింపుల్ గా ఒక వైట్ టీ షర్ట్ తో రాహుల్ గాంధీ యాత్ర కొనసాగించడం ఒకటైతే, రెండోదీ రాహుల్ గాంధీ గడ్డం.

Rahul Gandhi to address Cambridge University: కేంబ్రిడ్జ్ నుంచి ఆహ్వానం రావడంతో..

భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డంపై బీజేపీ విమర్శలు కూడా చేసింది. ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ తో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అయితే, అవేమీ రాహుల్ పట్టించుకోలేదు. భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత కూడా రాహుల్ గాంధీ గడ్డం తీయలేదు. ట్రిమ్ కూడా చేయలేదు. అదే పెద్ద గడ్డం కొనసాగించారు. అయితే, తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం రావడంతో, రాహుల్ గాంధీ ఆ గడ్డాన్ని కాస్త ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు, ఆ గడ్డాన్ని ట్రిమ్ చేసి, హెయిర్ కట్ చేసుకుని, కొత్త లుక్ తో ఆయన ఫ్రెష్ గా కనిపిస్తున్నారు.

Rahul Gandhi in New look viral: సోషల్ మీడియాలో..

రాహుల్ గాంధీ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంబ్రిడ్జ్ వర్సిటీ కార్యక్రమంలో పాల్గొనడం కోసం రాహుల్ గాంధీ లండన్ చేరుకున్నారు. యూకేలో రాహుల్ గాంధీ దాదాపు వారం రోజులు పర్యటించనున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ (Cambridge University) లో "Learning to listen in the 21st century" అనే అంశంపై ప్రసంగించనున్నారు. అలాగే, ఆ యూనివర్సిటీలోని బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులతో ముఖాముఖి లో పాల్గొంటారు. అలాగే, యూకేలోని భారతీయులతో ఇంటరాక్ట్ అవుతారు. భారతీయ వ్యాపార వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.

తదుపరి వ్యాసం