తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు

HT Telugu Desk HT Telugu

31 March 2023, 21:33 IST

  • Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పరువునష్టం కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా, ఆరెస్సెస్ (RSS) పై చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయనపై మరో పరువునష్టం కేసు నమోదైంది.

రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో) (HT_PRINT)

రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై మరో పరువునష్టం కేసు (criminal defamation case) నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా పలు బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించారు. అలా ఒక సభలో ప్రసంగిస్తూ, ఆరెస్సెస్ (RSS) పై విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై ఇప్పుడు పరువు నష్టం దావా వేశారు.

ట్రెండింగ్ వార్తలు

Bengaluru: బెంగళూరులో రాత్రంతా భారీ వర్షం; విమానాశ్రయంలో లీకేజీ; పలు ఫ్లైట్స్ రద్దు

Kejriwal gets interim bail: కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు; ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారానికి వీలు

Man chops off girl's head: పెళ్లి క్యాన్సిల్ అయిందని మైనర్ తల నరికి, తీసుకువెళ్లిన యువకుడు

స్టూడెంట్​తో సెక్స్​ చేసిన టీచర్​ అరెస్ట్​.. బెయిల్​పై బయటకు వచ్చి మరో విద్యార్థి వల్ల గర్భం!

Rahul Gandhi: కౌరవుల వారసులు..

భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆరెస్సెస్ (Rashtriya Swayamsewak Sangh RSS) వారిని 21వ శతాబ్దపు కౌరవులుగా అభివర్ణించారు. భారత్ జోడో యాత్ర ముగిసి కూడా మూడు నెలలు ముగిశాయి. తాజాగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) నాడు ఆరెస్సెస్ (RSS) వారిని 21వ శతాబ్ధపు కౌరవులుగా అభివర్ణించడంపై హరిద్వార్ కోర్టులో శుక్రవారం పరువునష్టం పిటిషన్ (criminal defamation case) దాఖలైంది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై బిహార్ లోని ఒక కోర్టులోనూ పరువునష్టం దావా (criminal defamation case) దాఖలైంది. ఆ కేసును బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వేశారు.

Rahul Gandhi: రెండేళ్ల జైలు శిక్ష

ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఇటీవల రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై పై కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. కాగా, ఈ తీర్పు వెలువడిన మర్నాడే, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, రాహుల్ గాంధీ (Rahul Gandhi) ని లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా లోక్ సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఆ మర్నాడే, ఎంపీగా ఢిల్లీలో ఆయనకు కేటాయించిన బంగళాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విపక్షాలు ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించాయి.

Rahul Gandhi: మహారాష్ట్రలో కూడా..

మహారాష్ట్రలోని థానేలో కూడా రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై ఒక పరువు నష్టం కేసు నడుస్తోంది. మహాత్మా గాంధీ హత్యకు ఆరెస్సెస్ (RSS) కారణమని 2014 లో రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ (RSS) కార్యకర్త ఒకరు థానే కోర్టులో దావా (criminal defamation case) వేశారు. మరోవైపు, సావర్కర్ (Savarkar) ను బ్రిటిష వారిని క్షమాపణలు కోరారంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పదేపదే చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ నేతలే కాకుండా, మిత్రపక్షమైన శివసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.