Queen Elizabeth death : క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూత
09 September 2022, 6:31 IST
- Queen Elizabeth death : క్వీన్ ఎలిజబెత్ 2 తుదిశ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా ఆమె మరణించారు.
క్వీన్ ఎలిజబెత్
Queen Elizabeth death : క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. 96ఏళ్ల వయస్సులో ఆమె తుదిశ్వాస విడిచారు. వయస్సు రిత్యా వచ్చిన అనారోగ్యం కారణంగా బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఆమె మరణించినట్టు బకింగ్హమ్ ప్యాలెస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
రాణి ఎలిజబెత్ 2 మరణంతో ఆమె పెద్ద కుమారుడు 73ఏళ్ల చార్లెస్.. కింగ్ చార్లెస్ 3గా సింహాసనాన్ని అధిష్టించారు.
బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం రాణిగా కొనసాగారు ఎలిజబెత్ 2. రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యంపై గురువారం వార్తలు వెలువడిన కొన్ని గంటలకే.. ఆమె మరణవార్తపై బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటన చేసింది.
Queen Elizabeth death in telugu : గతేడాది అక్టోబర్ నుంచి క్వీన్ ఎలిజబెత్ 2 ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి.. నడవడం, నిలబడే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
క్వీన్ ఎలిజబెత్.. తన ప్రవర్తన, తన మనస్తత్వంతో ఎందరికో చేరువయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందారు.
ప్రపంచ నేతల నివాళులు..
రాణి ఎలిజబెత్ 2 మరణ వార్తపై ప్రపంచ దేశాధినేతలు స్పందించారు. ఆమె మరణానికి నివాళులర్పించారు.
Queen elizabeth death news : "వేగంగా మారిపోతున్న ప్రపంచంలో.. ఆమె(క్వీన్ ఎలిజబెత్ 2) స్థిరంగా తన ఉనికిని కొనసాగించారు. బ్రిటన్వాసుల్లో కొన్ని తరాల వారికి ఆమె గౌరవంగా నిలించారు. ఆమె తప్ప ఇతర రాజులు, రాణులు తెలియనివారు.. ఆమెను చూసి గర్వించారు. బ్రిటన్ చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రపంచ కథలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది," అని అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ జో బైడెన్- జిల్ బైడెన్ ఓ ప్రకటన చేశారు.
"ప్రపంచవ్యాప్తంగా రాణి ఎలిజబెత్కు ప్రేమ, గౌరవం దక్కింది. వాటిని ఆమె సంపాదించుకున్నారు. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్వీన్ ఎలిజబెత్ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబసభ్యులు, బ్రిటన్ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి," అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
"మన కాలంలో మెజెస్టీ క్వీన్ ఎలిజబెత్ 2 ఒక దిగ్గజంగా నిలిచిపోతారు. తన జాతికి, తన ప్రజలకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచారు. ఆమె మరణవార్త విని బాధ కలిగింది. ఆమె కుటుంబసభ్యులు, బ్రిటన్ ప్రజలకు నా సానుభూతి," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.