PNB Recruitment 2024 : పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,025 ఉద్యోగాలు - ఇవాళ్టి నుంచే దరఖాస్తులు ప్రారంభం
07 February 2024, 18:29 IST
PNB Specialist Officer Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1025 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచే షురూ అయింది. అర్హులైన వారు ఫిబ్రవరి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Punjab National Bank (PNB) has started the application process for Specialist Officer posts.
PNB Specialist Officer Recruitment 2024 Updates: పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 1,025 పోస్టులను భర్తీ చేయనున్నారు. ముందుగానే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఇవాళ్టి(ఫిబ్రవరి 7) నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 25 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.pnbindia.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ పరీక్ష మార్చి లేదా ఏప్రిల్ మాసంలో జరగనుంది.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - పంజాబ్ నేషనల్ బ్యాంకు
ఉద్యోగాల పేరు -స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు - 1025 (Officer-Credit 1000, Manager-Forex: 15 posts, Manager-Cyber Security: 5, Senior Manager-Cyber Security- 5 ఖాళీలు ఉన్నాయి.
వయో పరిమితి- ఆఫీసర్ (క్రెడిట్) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు జనవరి 1, 2024 నాటికి 21-28 ఏళ్లు మించరాదు. మేనేజర్ పోస్టులకైతే 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో సడలింపు ఛాన్స్ ఉంది.
దరఖాస్తులు - ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు - ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ 59 చెల్లించాలి. మిగతా అభ్యర్థులకు రూ.1180.
ఎంపిక విధానం - ఆన్ లైన్ ఎగ్జామ్, వ్యక్తిగత ఇంటర్వూ ఉంటాయి.
అధికారిక వెబ్ సైట్ - https://www.pnbindia.in/
ఇలా అప్లయ్ చేసుకోండి..
అర్హులైన అభ్యర్థులు మొదటగా.. www.pnbindia.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోం పేజీలో కెరీర్ ఆప్షన్ పై నొక్కాలి.
"RECRUITMENT FOR 1025 POSTS OF SPECIALIST OFFICERS UNDER HRP 2024" అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
మీ వివరాలను నమోదు చేయాలి. దరఖాస్తు రుసుం చెల్లించాలి.
కావాల్సిన పత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
సబ్మిట్ బటన్ పై నొక్కి అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు. రిఫరెన్స్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్ సమయంలో అవసరమవుతుంది.