IDBI Recruitment 2024 : ఐడీబీఐ బ్యాంకులో 500 ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే-idbi bank notifies vacancies for 500 junior assistant manager posts check the key details are here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Idbi Recruitment 2024 : ఐడీబీఐ బ్యాంకులో 500 ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

IDBI Recruitment 2024 : ఐడీబీఐ బ్యాంకులో 500 ఉద్యోగాలు - అర్హతలు, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 07, 2024 01:05 PM IST

IDBI Recruitment 2024 Updates: ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది ఐడీబీఐ బ్యాంక్. 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

ఐడీబీఐలో ఉద్యోగాలు
ఐడీబీఐలో ఉద్యోగాలు (IDBI)

IDBI Recruitment 2024 Updates: ఐడీబీఐ బ్యాంక్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తారు. మార్చి 17వ తేదీన ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. https://www.idbibank.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్యవివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - ఐడీబీఐ(Industrial Development Bank of India).

ఉద్యోగాల పేరు - జూనియర్ అసిస్టెంట్ మేనేజర్

మొత్తం ఖాళీలు -500

వయో పరిమితి - 20- 25 ఏళ్ల లోపు ఉండాలి.

అర్హతలు - ఏదైనా వర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం - ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వూ

దరఖాస్తు ఫీజు - ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 200 చెల్లించాలి. మిగతావారు రూ. 1000 దరఖాస్తు రుసుం చెల్లించాలి.

దరఖాస్తు విధానం - ఆన్ లైన్

దరఖాస్తులు ప్రారంభం - 12 ఫిబ్రవరి, 2024చ

దరఖాస్తులకు తుది గడువు - 26 ఫిబ్రవరి, 2024.

పరీక్ష తేదీ - మార్చి 17, 2024.
అధికారిక వెబ్ సైట్ - https://www.idbibank.in/

ఎలా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://www.idbibank.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోం పేజీలో career link పై క్లిక్ చేయాలి.

Current Openings లో JAM 2024 recruitment అనే ఆప్షన్ పై నొక్కాలి.

రిజిస్ట్రర్ ప్రాసెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు.

దరఖాస్తు రుసుమును చెల్లించాలి.

కావాల్సిన డాక్యూమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Submit అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు కాపీని పొందవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్