Union Bank of India Recruitment: యూనియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-union bank of india recruitment 2024 apply for 606 so posts till feb 23 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Union Bank Of India Recruitment: యూనియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

Union Bank of India Recruitment: యూనియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Feb 03, 2024 07:09 PM IST

Union Bank of India Recruitment: స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 23 వరకు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.unionbankofindia.co.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు..

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల్లో ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ. 175 కాగా, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850గా నిర్ణయించారు. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లకు అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేస్తారు.

ఇలా అప్లై చేయండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా..

  • యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.unionbankofindia.co.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో కనిపించే రిక్రూట్మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
  • "యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2024-25 (స్పెషలిస్ట్ ఆఫీసర్స్)" కోసం అప్లై లింక్ పై క్లిక్ చేయండి
  • కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులోని అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయండి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోండి.
  • పూర్తి వివరాలకు అభ్యర్థులు www.unionbankofindia.co.in వెబ్ సైట్ లో ఉన్న డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను పరిశీలించండి.

Whats_app_banner