తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ukraine Crisis | ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి థ్యాంక్స్‌ చెప్పిన ప్రధాని మోదీ

Ukraine Crisis | ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి థ్యాంక్స్‌ చెప్పిన ప్రధాని మోదీ

Hari Prasad S HT Telugu

07 March 2022, 13:24 IST

google News
  • ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. భారతీయులను తరలించడంలో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (AP)

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

న్యూఢిల్లీ: రష్యా దాడితో సతమతమవుతున్న ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సోమవారం మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత జెలెన్‌స్కీతో మోదీ మాట్లాడటం ఇది రెండోసారి. ఈ సందర్భంగా ఈశాన్య ఉక్రెయిన్‌ రాష్ట్రమైన సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు సహకరించాలని జెలెన్‌స్కీని మోదీ కోరారు. 

ఆ నగరంలో సుమారు 700 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చిక్కుకొని వాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. వాళ్లను తరలించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జెలెన్‌స్కీతో మోదీ 35 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పటి వరకూ భారతీయులను తరలించడంలో సహకరించినందుకుగాను ఆయనకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 

సుమీ నుంచి కూడా విద్యార్థులను తరలించడంలో ఇదే సహకారం అందించాలని జెలెన్‌స్కీని మోదీ కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులపైనా ఇద్దరు నేతలు చర్చించారు. రష్యాతో ఉక్రెయిన్‌ జరుపుతున్న చర్చలను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రశంసించారు.

టాపిక్

తదుపరి వ్యాసం