తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Record: మళ్లీ ప్రధాని మోదీదే ఆ రికార్డు..

PM Modi record: మళ్లీ ప్రధాని మోదీదే ఆ రికార్డు..

HT Telugu Desk HT Telugu

15 September 2023, 21:48 IST

google News
  • PM Modi record: ప్రధాని మోదీ మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలో అత్యంత ఆమోదనీయ నాయకుడి (most popular global leader) గా మరోసారి నిలిచారు. ఈ సర్వేలో ఆయనకు 76% రేటింగ్ లభించింది.

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో) (ANI)

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)

PM Modi record: ప్రపంచంలో అత్యంత ఆమోదనీయుడైన నాయకుల్లో తొలి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారు. ప్రపంచ నాయకుల ఆమోదనీయత (approval) పై అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ (Morning Consult) అనే కన్సల్టెన్సీ సంస్థ ఈ ‘Global Leader Approval Rating Tracker’ సర్వే నిర్వహించింది. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 12 మధ్య డేటాను సేకరించి ఫలితాలను ప్రకటించింది.

మోదీనే నంబర్ 1

అత్యధిక ప్రజలు నాయకుడిగా అంగీకరించిన ప్రపంచ నేత (most popular global leader) గా మోదీ మరోసారి నిలిచారు. గతంలో కూడా ఈ తరహా సర్వేలో ప్రధాని మోదీ తొలి స్థానంలో నిలిచారు. తాజా సర్వేలో మోదీకి 76% ప్రజలు అత్యంత ఆమోదనీయుడైన నాయకుడిగా తొలి స్థానం ఇచ్చారు. సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 10 తేదీల్లో జీ 20 సమావేశాలను ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో మోదీకి ఈ రికార్డు లభించింది. మోదీ నాయకత్వాన్ని 76% మంది ఆమోదించగా, 18% మంది వ్యతిరేకించారు. 6% ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.

తరువాతి స్థానాల్లో..

ఈ సర్వేలో మోదీ తరువాత రెండో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలెన్ బెర్సెట్ నిలిచారు. తనకు 64% ఆమోదనీయత లభించింది. ఆ తరువాత మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ ఉన్నారు. లోపెజ్ కు 61% రేటింగ్ లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 40%, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు 37%, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు 27%, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కు 24% రేటింగ్స్ మాత్రమే లభించాయి.

వివిధ దేశాల్లో..

సెప్టెంబర్ 6నుంచి సెప్టెంబర్ 12 మధ్య సేకరించిన డేటా ఆధారంగా ఈ వివరాలను ప్రకటించామని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది. ఆయా దేశాల్లోని పౌరుల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించామని వెల్లడించింది. వివిధ దేశాల్లో, వయోజనుల్లోని వివిధ ఏజ్ గ్రూప్ లకు సంబంధించిన వేర్వేరు సాంపిల్ సైజ్ లను సర్వే చేశామని తెలిపింది. అమెరికాలో సాంపిల్ సైజ్ 45 వేలు అని వివరించింది. రోజుకు కనీసం 20 వేల సాంపిల్స్ ను ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ చేశామని వెల్లడించింది.

తదుపరి వ్యాసం