తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Joins Whatsapp Channels: వాట్సాప్ చానల్స్ లోకి ప్రధాని మోదీ.. మీరూ ఫాలో కావచ్చు ఇలా..

PM Modi joins WhatsApp Channels: వాట్సాప్ చానల్స్ లోకి ప్రధాని మోదీ.. మీరూ ఫాలో కావచ్చు ఇలా..

HT Telugu Desk HT Telugu

19 September 2023, 19:57 IST

google News
  • PM Modi joins WhatsApp Channels: ప్రఖ్యాత సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో కొత్తగా ప్రారంభమైన ఫీచర్ ‘వాట్సాప్ చానల్స్ (WhatsApp Channels)’ లో ప్రధాని మోదీ కూడా చేరారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో అభిమానులతో సమాచారం పంచుకునేందుకు వీలుగా ఉన్న ఈ ప్లాట్ ఫామ్ లో ప్రధాని కూడా జాయిన్ అయ్యారు.

ప్రధాని మోదీ వాట్సాప్ చానల్
ప్రధాని మోదీ వాట్సాప్ చానల్ (ANI)

ప్రధాని మోదీ వాట్సాప్ చానల్

PM Modi joins WhatsApp Channels: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాట్సాప్ చానెల్ (WhatsApp Channels) లో మంగళవారం జాయిన్ అయ్యారు. ఇది వాట్సాప్ లో లేటెస్ట్ గా ప్రారంభమైన ఫీచర్. ఇది ఒక రకంగా వన్ వే బ్రాడ్ కాస్టింగ్ చానల్. దీని ద్వారా ఒకే సమయంలో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్స్ తో కనెక్ట్ కావచ్చు.

సోషల్ మీడియాలో..

సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్ లో ఆయన చాలా ఫేమస్. ట్విటర్ సహా అనేక సోషల్ మీడియా అకౌంట్లలో రికార్డు స్థాయిలో ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన వాట్సాప్ చానల్స్ లోనూ జాయినయ్యారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల లోనూ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకునే ఆలోచనలో బీజేపీ ఉంది. అందులో భాగంగానే ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని వీలైన అన్ని సోషల్ మీడియా చానల్స్ ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలనుకుంటోంది.

వాట్సాప్ చానల్ అంటే..

వాట్సాప్ చానల్ ఒక రకంగా వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్ . దీని ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా టెక్ట్స్, ఫొటోస్, వీడియోస్, స్టికర్స్ పంపించవచ్చు. ఒపీనియన్ పోల్స్ వంటి వాటిని నిర్వహించవచ్చు. వాట్సాప్ లో ఈ ఫీచర్ అప్ డేట్స్ ట్యాబ్ లో కనిపిస్తుంది. అప్ డేట్స్ లో మీరు ఫాలో కావాలనుకునే చానల్స్ ను, స్టేటస్ లను ఫాలో కావచ్చు. ఏ చానల్స్ ఫాలో కావాలనే సూచనలు కూడా వాట్సాప్ ఇస్తుంది. యాక్టివ్ గా ఉన్న చానల్స్, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న చానల్స్ ను మీకు చూపుతుంది. ఆయా చానల్స్ లో మీకు నచ్చిన పోస్ట్ లను ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. షేర్ లేదా ఫార్వర్డ్ చేయడానికి వీలుగా లింక్ కూడా కనిపిస్తుంది.

How to join PM Modi's WhatsApp channel?: ప్రధాని మోదీ వాట్సాప్ చానల్ లో చేరడం ఎలా?

ప్రధాని మోదీ లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన వాట్సాప్ చానల్ లో చేరడానికి మీరు ముందుగా..

  • మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయాలి.
  • అప్ డేట్స్ ట్యాబ్ ను ఓపెన్ చేయాలి.
  • ఫైండ్ చానల్స్ (Find Channel) ఆప్షన్ ను ఎంచుకోవాలి.
  • నరేంద్ర మోదీ (Narendra Modi) చానల్ కోసం సెర్చ్ చేయాలి.
  • మీకు ప్రధాని మోదీకి చెందిన వాట్సాప్ చానల్ కనిపిస్తుంది.
  • ఆ చానల్ కు సబ్ స్క్రైబ్ చేసి, ఫాలో కావచ్చు.

తదుపరి వ్యాసం