WhatsApp Channels launched in India : యూజర్లను ఆకర్షించేందుకు నిత్యం కృషిచేసే మెటా ఆధారిత మెసేజింగ్ యాప్ వాట్సాప్.. మరో క్రేజీ ఫీచర్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే 'వాట్సాప్ ఛానెల్స్'. ఛాట్స్, కాల్స్ మధ్యలో ఉండాల్సిన 'స్టేటస్' ఆప్షన్ స్థానంలో 'అప్డేట్స్' ఆప్షన్ వచ్చింది. ఇందులో.. స్టేటస్, ఛానెల్స్ రెండింటినీ చూసుకోవచ్చు. ఇండియాలో లాంచ్ అవ్వడమే ఆలస్యం.. అనేకమంది ప్రముఖులు.. తమకంటూ ఒక ఛానెల్‌ను క్రియేట్ చేసేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు వాట్సాప్ ఛానెల్‌ను ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇతరులను ఎలా ఫాలో అవ్వాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
స్టెప్ 1:- ముందుగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 1:- ఆప్డేట్స్లోకి వెళ్లి 'ఛానెల్స్' ఐకాన్ మీద క్లిక్ చయండి. '+' ఆప్షన్‌ను వాడండి.
How to create WhatsApp channels : స్టెప్ 1:- అక్కడ.. క్రియేట్ ఛానెల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ కనిపించే ఇన్స్ట్రుక్షన్స్ను ఫాలో అవ్వండి.
స్టెప్ 1:- ఇప్పుడు మీ ఛానెల్ పేరు, డిస్క్రిప్షన్, ప్రొఫైల్ ఫొటో వంటివి యాడ్ చేయండి.
స్టెప్ 1:- చివరిగా.. క్రియేట్ ఛానెల్ మీద క్లిక్ చేయండి. అంతే.. మీ వాట్సాప్ ఛానెల్ క్రియేట్ అయిపోతుంది!
అప్డేట్స్ ఆప్షన్‌లోకి వెళితే.. మీకు ఛానెల్స్ కనిపిస్తాయి. వాటి పక్కనే '+' ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు.. సంబంధిత ఛానెల్‌ను మీరు ఫాలో అయిపోతారు. మనకు నచ్చిన ఛానెల్‌ను వెతుక్కునేందుకు.. సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది. సెర్చ్ చేసి, ఛానెల్‌ను యాడ్ చేసుకోవచ్చు.
WhatsApp channels India : ఛానెల్ లింక్ షేర్ చేసే ఆప్షన్ని కూడా ఇచ్చింది వాట్సాప్. మీ దగ్గర ఏదైనా ఛానెల్ లింక్ ఉంటే.. దాని మీద క్లిక్ చేయండి. ఛానెల్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ ఉండే ఫాలో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు. మీరు దానిని ఫాలో అవ్వడం మొదలుపెడతారు.
సంబంధిత కథనం