తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bbc Documentary On Modi : ఆ డాక్యుమెంటరీపై స్పందించిన మోదీ!

BBC documentary on Modi : ఆ డాక్యుమెంటరీపై స్పందించిన మోదీ!

29 January 2023, 8:41 IST

  • BBC documentary on Modi : ఎన్​సీసీ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఐకమత్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతోందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎన్​సీసీ ర్యాలీలో ప్రసంగించిన మోదీ
ఎన్​సీసీ ర్యాలీలో ప్రసంగించిన మోదీ (HT_PRINT)

ఎన్​సీసీ ర్యాలీలో ప్రసంగించిన మోదీ

PM Modi on BBC documentary : భారత్​ అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్న కొందరు.. దేశంలో విభజన సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కానీ అలాంటి ప్రయత్నాలు ఇండియాలో కచ్చితంగా విఫలమవుతాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

RRB RPF Recruitment 2024: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4660 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

యువతకు ఇదే మంచి అవకాశం..

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరిగిన ఎన్​సీసీ (నేషనల్​ క్యాడెట్​ కార్ప్స్​) ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. ఈ క్రమంలోనే.. ఐకమత్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

PM Modi NCC rally 2023 : "దేశంలోని యువత కారణంగా.. ప్రపంచం మొత్తం ఇండియావైపు చూస్తోంది. యువతకు లబ్ధిచేకూర్చే విధంగా.. మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. డిజిటల్​, స్టార్టప్​, ఆవిష్కరణల కోసం ఖర్చు చేస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు.. దేశంలోని యువతకు ఇదే సరైన సమయం. ఇండియా టైమ్​ వచ్చిందన్న విషయం అందరికి తెలుసు," అని మోదీ అన్నారు.

గణతంత్ర్య దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎన్​సీసీ క్యాడెట్​లను ప్రశంసించారు ప్రధాని. నూతన ఉత్తేజం, ఆసక్తితో పరుగులు తీస్తున్న యువతే.. భారత దేశానికి ప్రధానమని అభిప్రాయపడ్డారు. మహిళలకు కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

PM Modi latest news : "పోలీసు, పారామిలిటరీ దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతోంది. గత ఎనిదేళ్లల్లో ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది. మహిళల అభివృద్ధి కోసం త్రిదళాల్లో మార్గం సుగమం అయ్యింది," అని మోదీ అభిప్రాయపడ్డారు.

బీబీసీ డాక్యుమెంటరీని ఉద్దేశించి మాట్లాడారా?

ఈ క్రమంలో.. దేశాన్ని విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు మోదీ.

BBC documentary on Modi watch online : "దేశాన్ని విడగొట్టేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భరతమాత బిడ్డలను వేరు చేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అందరు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా.. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. భారత దేశ ప్రజలు ఐకమత్యంతోనే ఉంటారు. విభజన రోగానికి ఐకమత్యం మంత్రమే విరుగుడు! భారత దేశ శక్తిని పెంపొందించేందుకు ఐకమత్యం ఉపయోగపడుతుంది. భారత దేశం మరింత గొప్పగా ఎదిగేందుకు ఐకమత్యమే పనికొస్తుంది," అని తెలిపారు ప్రధాని మోదీ.

2002 గుజరాత్​ హింసాకాండాపై బీబీసీ చేసిన ఓ డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారిన తరుణంలో.. 'ఐకమత్యం'పై మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరిచుకున్నాయి. ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. కానీ పలు వర్సిటీలోని విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా.. దీనిని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది విద్యార్థులు ఇప్పటికే జైలు పాలయ్యారు!

తదుపరి వ్యాసం