Agnipath: సైన్యంలో ‘అగ్నిపథ్’ ఓ గేమ్ చేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ-agnipath will be game changer in strengthening military says prime minister narendra modi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Agnipath Will Be Game Changer In Strengthening Military Says Prime Minister Narendra Modi

Agnipath: సైన్యంలో ‘అగ్నిపథ్’ ఓ గేమ్ చేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 16, 2023 08:28 PM IST

PM Narendra Modi on Agnipath: సైన్యంలో చేరనున్న తొలి బ్యాచ్ అగ్నివీరులను ప్రధాని మోదీ అభినందించారు. అగ్నిపథ్ పథకం ప్రాధాన్యత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Agnipath: సైన్యంలో ‘అగ్నిపథ్’ ఓ గేమ్ చేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ
Agnipath: సైన్యంలో ‘అగ్నిపథ్’ ఓ గేమ్ చేంజర్: ప్రధాని నరేంద్ర మోదీ (ANI/PIB)

PM Narendra Modi on Agnipath: సైన్యాన్ని బలోపేతం చేయటంలో అగ్నిపథ్ పథకం ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సైన్యం మరింత సిద్ధంగా ఉండేందుకు అగ్నిపథ్ ఎంతో ముఖ్యమని అన్నారు. త్రివిధ దళాల్లో చేరుతున్న తొలి బ్యాచ్ అగ్నివీరులతో (Agniveers) ప్రధాని మోదీ సోమవారం (జనవరి 16) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కీలకమైన మైలు రాయిగా నిలిచే అగ్నిపథ్ పథకానికి మార్గదర్శకులుగా నిలిచారని తొలి బ్యాచ్ అగ్నివీరులను ప్రశంసించారు.

ట్రెండింగ్ వార్తలు

మరింత యూత్‍ఫుల్‍గా..

PM Narendra Modi on Agnipath: యువ అగ్నివీరుల చేరికతో భారత సాయుద దళాలు మరింత యూత్‍ఫుల్‍గా ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతుందని అన్నారు. అగ్నివీరుల ధైర్య సాహసాలను ప్రశంసించారు.

ఈ అనుభవం.. జీవితానికి గర్వకారణం

PM Narendra Modi on Agnipath: సైన్యంలో పని చేసిన అనుభవం.. అగ్నివీరుల జీవితానికి గర్వకారణంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. “నవ భారతం (New India).. నూతన శక్తితో నిండిఉంది. సాయుధ బలగాలను ఆధునికీకరిచటంతో పాటు ఆత్మనిర్భరంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుత తరం యువతకు అపార సామర్థ్యం ఉంది. రానున్న కాలంలో సైన్యంలో అగ్నివీరులు ప్రముఖ పాత్ర పోషించనున్నారు” అని మోదీ అన్నారు.

చాలా విషయాలను తెలుసుకుంటారు

“దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం వల్ల అగ్నివీరులు విభిన్నమైన అనుభవాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. అగ్నివీరులు వివిధ భాషలను నేర్చుకునేందుకు ప్రయత్నించాలి. విభిన్న సంస్కృతులు, జీవన విధానాల గురించి తెలుసుకోవచ్చు. నాయకత్వ లక్షణాలు కూడా అగ్నివీరులకు మెరుగువుతాయి” అని మోదీ అన్నారు.

అగ్నిపథ్ పథకం గురించి..

అగ్నిపథ్ పథకాన్ని గతేడాది జూన్‍లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద, యువత సైన్యంలో నాలుగేళ్ల పాటు పని చేయవచ్చు. సైన్యంలో చేరేందుకు 17.5 సంవత్సరాల వయసు నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆరు నెలల శిక్షణ, మూడున్నర సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. ఆ తర్వాత అగ్నివీరుల్లో 25 శాతం మందిని ప్రభుత్వం పర్మినెంట్ చేస్తుంది. మిగిలిన 75 శాతం మందికి అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్‍ను ప్రభుత్వం ఇస్తుంది. ఈ సర్టిఫికేట్.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అదనపు అర్హతగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

తొలి దశలో 46,000 అగ్నివీర్ పోస్టులకు 54 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఆర్మీకి 40వేల మంది, వైమానిక దళానికి, నేవికి చెరో 3వేల మంది ఎంపికయ్యారు.

IPL_Entry_Point