PM Kisan 12th installment: రైతులకు గుడ్ న్యూస్… ఆ రోజే రూ. 2 వేలు జమ!
16 October 2022, 7:54 IST
- pm kisan samman nidhi funds: రైతులకు తీపి కబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ స్కీమ్ 12 విడత డబ్బుల జమ చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ముహుర్తం ఖరారు చేసింది.
రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
pm kisan samman nidhi 12th installment: రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను.. పలు విడుతల్లో ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 12వ విడత నిధుల జమకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో 11 విడతల డబ్బును జమ చేసింది. తాజాగా 12వ విడత డబ్బులను అందించేందుకు రెడీగా ఉంది. అక్టోబర్ 17న పీఎం కిసాన్ 12వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. అర్హత కలిగిన రైతుల బ్యాంక్ అకౌంట్లలో ఈ రూ. 2 వేలు జమ అవుతాయి.
ఆ రోజు ఉదయం 11 గంటలకు 12వ విడత డబ్బులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు సీఎస్‌సీ( Common Services Centres) ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రూ. 16వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేయనున్నారు.
ఇలా చెక్ చేసుకోవచ్చు
పీఎం కిసాన్ కు సంబంధించిన వివరాలను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం pmkisan.gov.in వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఇందులో కుడి వైపున ఫార్మర్ కర్నార్ (Farmers Corner) అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే click Beneficiary Status అనే అప్షన్ కనిపిసుంది. దీంట్లో ఆధార్, బ్యాంక్, అనుసంధానం చేసిన మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి మీ ఖాతా వివరాలను తెలుసుకోవచ్చు. మీ వివరాలు నమోదు కాకపోతే సంబంధిత వివరాలు ఇందులో కనిపించవు.
మొబైల్ యాప్ సాయంతో కూడా మీ పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్లో PM KISAN Appని డౌన్లోడ్ చేసుకోవాలి. సంబంధిత వివరాలను నమోదు చేస్తే కూడా పూర్తి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.
ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో 2019లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రతీ ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000ను జమ చేస్తారు. ఇప్పటి వరకు 11 ఇన్‌స్టాల‌్‌మెంట్స్ లో డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు.
ఈ స్కీమ్ అందలాంటే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. కేవలం రెండు హెక్టార్లలోపు భూమి ఉన్న రైతులకే మాత్రమే అందిస్తారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్ ఆర్మీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు అర్హులు కారు. పదవీ విరమణ తరువాత పెన్షన్ పొందే వాళ్లు కూడా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.