Paytm share price : పేటీఎం షేర్ ప్రైస్ టార్గెట్.. రూ. 940?
28 June 2022, 12:28 IST
- Paytm share price : పేటీఎం స్టాక్ రెండు వారాల్లో 24శాతం పెరిగింది. ఇంకా పెరుగుతుందా? ఇక్కడ కొనుగోలు చేయవచ్చా?
పేటీఎం షేర్ ప్రైస్ టార్గెట్.. రూ. 940?
Paytm share price : ఐపీఓ నుంచి మదుపర్లకు నష్టాలనే మిగిల్చిన పేటీఎం స్టాక్.. ఇప్పుడు ఊపందుకుంటోంది! నాలుగు రోజులు వరుస లాభాలను చూసింది. అంతేకాకుండా.. రెండు వారాల్లో ఏకంగా 24శాతం పెరిగింది ఈ పేటీఎం షేర్ ప్రైస్.
2022 మేలో రూ. 510.05 వద్ద ఆల్‌టైమ్ లో ను తాకింది పేటీఎం స్టాక్. అక్కడి నుంచి క్రమంగా పుంజుకుంది. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 724ను తాకి ప్రస్తుతం 714 వద్ద కొనసాగుతోంది. ఈ ఒక్క ట్రేడింగ్ సెషన్లోనే పేటీఎం షేర్ ప్రైస్ దాదాపు 2శాతం పెరిగింది.
కారణం ఏంటి?
మార్కెట్ నిపుణుల టెక్నికల్ ఎనాలసిస్ ప్రకారం.. రూ. 650 వద్ద పేటీఎం స్టాక్ 'ట్రైయాంగిల్ పాటర్న్' బ్రేక్అవుట్ ఇచ్చింది. అందుకే రెండు వారాలుగా పేటీఎం షేర్ ప్రైస్ పెరుగుతూ వస్తోంది. అంతేకాకుండా రూ. 720 వద్ద ఈ పేటీఎం స్టాక్ 'కప్ అండ్ హోల్డర్' బ్రేక్అవుట్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
Paytm share price target : మంగళవారం ట్రేడింగ్ సెషన్లో.. పేటీఎం షేర్ ప్రైస్ రూ. 720 కన్నా ఎక్కువలో క్లోజ్ అయితే.. స్వల్ప కాలంలో ఆ స్టాక్ రూ. 940కి కూడా చేరుకునే అవకాశం ఉంది.
కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లెక్కలన్నీ టెక్నికల్ ఎనాలసిస్వే. ఫండమెంటల్స్ ప్రకారం సంస్థ పరిస్థితి మారలేదు.
"పేటీఎం షేర్ ప్రైస్ రూ. 800- రూ. 940కి చేరే అవకాశం ఉంది. కానీ రూ. 680- రూ 700 రేంజ్‌లోనే కొనుగోలు చేయాలి. స్టాప్‌లాస్ రూ. 650గా ఉండాలి. రూ. 800 ఎగువన పేటీఎం స్టాక్ స్థిరపడితే.. రూ. 940 టార్గెట్‌ను సాధించగలుగుతుంది," అని జీసీఎల్ సెక్యూరిటీస్‌కి చెందిన రవి సింఘాల్ వెల్లడించారు.
Paytm IPO : 2021 నవంబర్‌లో పేటీఎం ఐపీఓ మార్కెట్లోకి వచ్చింది. దాని ప్రైజ్బ్యాండ్ షేరుకు.. రూ. 2080- రూ. 2150. కానీ పేటీఎం స్టాక్ లిస్టింగ్ డిస్కౌంట్లో జరిగింది. ప్రస్తుత పేటీఎం షేర్ ప్రైస్‌ను.. రూ. 2150 అప్పర్ ప్రైజ్ బ్యాండ్‌తో పోల్చుకుంటే.. ఈ స్టాక్ 67శాతం దిగువన ట్రేడ్ అవుతున్నట్టు.