తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Passport : పాపం పాక్​.. లామినేషన్​ పేపర్ల కొరతతో పాస్​పోర్ట్​ తయారీ బంద్​!

Pakistan passport : పాపం పాక్​.. లామినేషన్​ పేపర్ల కొరతతో పాస్​పోర్ట్​ తయారీ బంద్​!

Sharath Chitturi HT Telugu

10 November 2023, 11:57 IST

  • Pakistan passport lamination : పాకిస్థాన్​ ప్రజలకు కొత్త సమస్య వచ్చిపడింది. లామినేషన్​ పేపర్ల కొరత కారణంగా..ఆ దేశంలో ఇప్పుడు పాస్​పోర్ట్​ తయారీ కష్టంగా మారింది.

పాపం పాక్​.. లామినేషన్​ పేపర్ల కొరతతో పాస్​పోర్ట్​ తయారీ బంద్​!
పాపం పాక్​.. లామినేషన్​ పేపర్ల కొరతతో పాస్​పోర్ట్​ తయారీ బంద్​!

పాపం పాక్​.. లామినేషన్​ పేపర్ల కొరతతో పాస్​పోర్ట్​ తయారీ బంద్​!

Pakistan passport lamination : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​ను మరో సమస్య కుదిపేస్తోంది! ఈ దేశంలో పాస్​పోర్ట్​ తయారీ నిలిచిపోయినట్టు సమాచారం. పాస్​పోర్ట్​ల కోసం కావాల్సిన లామినేషన్​ పేపర్ల కొరత ఏర్పడటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Chitta Ranjan Dash : ‘ఇప్పటికీ.. ఎప్పటికీ నేను ఆర్​ఎస్​ఎస్​ సభ్యుడినే’- హైకోర్టు జడ్జి!

Ebrahim Raisi death : ఇరాన్​ అధ్యక్షుడు రైసీని ఇజ్రాయెల్​ చంపేసిందా?

Porsche accident : ‘వ్యాసాలు రాయి..’ పోర్షేతో ఇద్దరిని చంపిన మైనర్​కి 15 గంటల్లోనే బెయిల్​!

Iran President : హెలికాప్టర్​లో ప్రయాణం.. ఆరోగ్యానికి హానికరం! నాడు సంజయ్​ గాంధీ- నేడు రైసీ..

పాస్​పోర్ట్​ కోసం లామినేషన్​ పేపర్లు లేవు..

పాకిస్థాన్​ పాస్​పోర్ట్​ తయారీకి కావాల్సిన లామినేషన్​ పేపర్ల కొరత ఏర్పడిందని ఆ దేశ డీజీఐపీ (డైరక్టరేట్​ జనరల్​ ఆఫ్​ ఇమిగ్రేషన్​ అండ్​ పాస్​పోర్ట్స్​) చెప్పినట్టు, ఓ​ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. పాస్​పోర్ట్​లు అందక చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించింది.

జైన్​ ఇజాజ్​ అనే పాకిస్థానీ.. యూకేలో చదువుకోవాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. యూకేలోని వర్సిటీలో సీటు కూడా వచ్చింది. సరిగ్గా అదే సమయంలో.. పాకిస్థాన్​లో పాస్​పోర్ట్​ తయారీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా.. అతను ఈసారి యూకేకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.

Pakistan passport issue : జైన్​తో పాటు ప్రస్తుతం.. వేలాది మంది పాకిస్థానీల పరిస్థితి ఇదే! విదేశాల్లో చదువు, ఉద్యోగం, పర్యటనల కోసం కావాల్సిన గ్రీన్​ కలర్​ బుక్​ను పాకిస్థాన్​ తయారు చేయలేకపోతోంది. లామినేషన్​ పేపర్లు లేకపోవడంతో చాలా పనులు ఆగిపోయాయి.

"పని కోసం నేను త్వరలోనే దుబాయ్​కి వెళ్లాల్సి ఉంది. మా జీవితాలు మారిపోబోతున్నాయని.. నేను, నా కుటుంబం చాలా సంతోషిచ్చాము. పేదరికంలో కూరుపోయిన మాకు మంచి జరుగుతోందని ఆనిందించాము. కానీ మా కలలను డీజీఐపీ చిదిమేసింది," అని గౌల్​ అనే పాకిస్థానీ, తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఎందరో ప్రజలు.. వారి కష్టాలను చెప్పుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.

Pakistan passport shortage : అయితే.. పాకిస్థాన్​లో పాస్​పోర్టుల తయారీ నిలిచిపోవడం ఇది కొత్త విషయమేమీ కాదు. 2013లో కూడా ఇదే జరిగింది. లామినేషన్​ పేపరలు లేవని, ప్రింటర్లకు డబ్బులు కట్టలేదన్న కారణాలతో పాస్​పోర్టుల తయారీ నిలిచిపోయినట్టు అప్పట్లో చెప్పుకొచ్చింది డీజీఐపీ.

ఈ విషయంపై అక్కడి మీడియా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

"మేము అదే పనిలో ఉన్నాము. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా.. బాక్​లాగ్​ (పాస్​పోర్టు ఇవ్వాల్సిన నెంబర్లు) సంఖ్య ఇప్పటికే తగ్గుతోంది," అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.

'మాకు నమ్మకం లేదు దొర..'

Pakistan passport news : అధికారిక అంచనాల ప్రకారం.. ఒక్క కరాచీ నుంచే రోజుకు 3వేలకుపైగా పాస్​పోర్ట్​ అప్లికేషన్లు వెలతాయి. పరిస్థితిని కంట్రోల్​ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం మాటలను నమ్మే స్థితిలో అక్కడి ప్రజలు లేనట్టు కనిపిస్తోంది!

"ప్రభుత్వం మాటలను నేను నమ్మను. రెండు నెలల క్రితం నేను పాస్​పోర్ట్​కు అప్లై చేశాను. ఇంకా రాలేదు," అని కరాచీకి చెందిన ఓ వ్యక్తి తెలిపాడు.

తదుపరి వ్యాసం