తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Bomb Blast : పోలియో డ్రైవ్​ లక్ష్యంగా బాంబు దాడి.. ఆరుగురు మృతి- 22మందికి గాయాలు

Pakistan bomb blast : పోలియో డ్రైవ్​ లక్ష్యంగా బాంబు దాడి.. ఆరుగురు మృతి- 22మందికి గాయాలు

Sharath Chitturi HT Telugu

08 January 2024, 13:32 IST

google News
  • Pakistan bomb blast today : పోలియో డ్రైవ్​ని నిలిపివేయడమే లక్ష్యంగా.. పాకిస్థాన్​లో జరిగిన బాంబు దాడిలో ఆరుగురు మరణించారు. మరో 22మంది గాయపడ్డారు.

పోలియో డ్రైవ్​ లక్ష్యంగా బాంబు దాడి.. !
పోలియో డ్రైవ్​ లక్ష్యంగా బాంబు దాడి.. !

పోలియో డ్రైవ్​ లక్ష్యంగా బాంబు దాడి.. !

Pakistan bomb blast today : బాంబు దాడితో పాకిస్థాన్​ మరోమారు ఉలిక్కిపడింది. పోలియో డ్రైవ్​కు భద్రత కల్పించేందుకు వెళుతున్న భద్రతా బృందమే లక్ష్యంగా జరిగిన ఈ బాంబు పేలుడు ఘటనలో.. ఆరుగురు పోలీసులు మరణించారు. మరో 22మంది గాయపడ్డారు.

పాకిస్థాన్​లో బాంబు పేలుడు..

పాకిస్థాన్​ ఖైబర్​ పంఖ్తుక్వా రాష్ట్రంలోని బజౌర్​ జిల్లాలో సోమవారం జరిగింది ఈ ఘటన. ఆ ప్రాంతంలో పోలియో డ్రైవ్​ చేపట్టారు. డ్రైవ్​లోని సభ్యులకు భద్రతను కల్పించేందుకు పోలీసు సిబ్బంది ఓ వ్యాన్​ ఎక్కిన కొన్ని క్షణాలకే భారీ పేలుడు శబ్దం విపించింది. ఇతరులు అక్కడికి వెళ్లి చూడగా.. ఆరుగురు మృతదేహాలు లభించాయి. వారందరు పోలీసులే! ఘటనలో గాయపడిన 22మందిని అధికారులు.. ఆసుపత్రికి తరలించారు.

Pakistan bomb blast : టీకాలను ఉగ్రవాదులు వ్యతిరేకిస్తారు. అందుకే.. పోలియో డ్రైవ్స్​పై దాడులు చేస్తూ ఉంటారు. పాకిస్థాన్​ తాలిబన్​ ఇస్లామిస్ట్​ మిలిటెంట్ల్​ బృందం.. తరచూ ఇలాంటి వ్యాక్సినేషన్​ డ్రైవల్​పై దాడి చేస్తుంది. సోమవారం కూడా అదే జరుగుతుందన్న భయంతో పోలీసుల భద్రతను కోరారు అధికారులు. ఎంత భద్రత ఉన్నా.. మళ్లీ బాంబు పేలుడు సంభవించడం గమనార్హం. తాజా ఘటనకు ఎవరు కారణం? అన్న వివరాలు తెలియరాలేదు.

కాగా.. ఈ ఘటపై ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేపీకే అర్షన్​ హుస్సెన్​ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. "చిట్టచివరి ఉగ్రవాదిని మట్టుబెట్టేంత వరకు.. ఉగ్రవాదంపై తమ పోరాటం కొనసాగుతుంది," అని వ్యాఖ్యానించారు.

Bomb blast near polio vaccination drive : పాకిస్థాన్​లో తాజా బాంబు పేలుడు ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. "ఇలాంటి దాడులతో తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసిన ప్రాణ త్యాగం చరిత్రలో గుర్తుండి పోతుంది," అని బలంగా చెప్పారు.

పాకిస్థాన్​లో బాంబు దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. పోలీసు సిబ్బందిపైనా దాడులు ఎక్కువ అవుతున్నాయి. గత నవంబర్​లో, పాకిస్థాన్​ టాంక్​ ప్రాంతంలో జరిగిన ఓ ఉగ్రదాడిలో ముగ్గురు పోలీసులు మరణించారు. ఓ మహిళను కిడ్నాప్​ చేసిన వారిని పట్టుకునేందుకు వెళుతుండగా.. ఈ దాడి జరిగింది!

తదుపరి వ్యాసం