Turkey bomb blast : టర్కీ పార్లమెంట్‌కు సమీపంలో బాంబు పేలుడు!
Turkey bomb blast : టర్కీ పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది! ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ప్రజలకు ఎలాంటి గాయాలవ్వలేదు.
Turkey bomb blast : టర్కీ రాజధాని అంకారాలో జరిగిన ఉగ్రదాడి కలకలం సృష్టించింది. పార్లమెంట్ భవనానికి సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారని సమాచారం.
కాగా.. ఆత్మహుతి దాడి జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో.. మరో వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. కొద్ది సేపటి తర్వాత.. పోలీసులు అతడిని హతమార్చారు.
"ఇద్దరు ఉగ్రవాదులు.. మిలిటరీ వెహికిల్‌లో ఉదయం 9:30 గంటలకు వచ్చారు. ఇంటీరియర్ మినిస్ట్రీలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యురిటీ విభాగం ఉన్న గేట్ వద్దకు వెళ్లారు. అక్కడ పేలుడు సంభవించింది," అని చెబుతూ.. ఇదొక ఉగ్రవాద ఘటన అని టర్కీ ప్రభుత్వం వెల్లడించింది.
Turkey terrorist attack : అంకారాలో ఇంకొన్ని గంటల్లో పార్లమెంట్ సమావేశలు మొదలవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ భవనానికి సమీపంలో పేలుడు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది.
పార్లమెంట్‌కు సమీపంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్లు.. ఆ ప్రాంతంలో తనిఖీలు చేపడుతున్నాయి.
ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్టు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికైతే.. ఘటనాస్థలంలోకి, పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదని వెల్లడించింది.
Terror attack in Turkey : టర్కీ ఉగ్రదాడికి బాధ్యులు ఎవరు? అన్న విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కాగా.. పార్లమెంట్‌కు సమీపంలో బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టర్కీ రాజధాని నగరం అంకారాలో బాంబు పేలుడు ఘటనలు.. అక్కడి ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 2015, 2016 సమయంలో నిషేధిత పీకేకే (కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ) వేర్పాటువాద కార్యకలాపాలతో అంకారా అట్టుడికింది.
సంబంధిత కథనం