Explosion in Russia : పెట్రోల్ బంక్‌లో భారీ పేలుడు.. 25మంది దుర్మరణం!
Explosion in Russia : రష్యాలోని ఓ ప్రాంతంలో పెట్రోల్ బంక్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25మంది మరణించారు.
Explosion in Russia : రష్యాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డగేస్టాన్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పేలుడు సంభవించింది. అనంతరం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25మంది మరణించారు. 60మందికిపైగా ప్రజలు గాయపడ్డారు.
అసలేం జరిగింది..?
డగెస్టాన్లోని మఖ్చఖ్లా అనే ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్‌లోని కార్ సర్వీస్ స్టేషన్లో మరమ్మత్తు నిర్వహిస్తుండగా.. ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే అప్రమత్తం అయ్యారు. ఘటనాస్థలానికి పరుగులు తీసిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. చాలా సేపటి తర్వాత మంటలను అదుపుచేశారు.
Russia explosion latest news : ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపడతామని అధికారులు చెప్పారు. కాగా.. తీవ్రంగా గాయపడిన వారిని మాస్కోకు తరలించేందుకు.. ప్రత్యేక హెలికాఫ్టర్లను మఖ్చఖ్లాకు పంపించారు అధికారులు.
కార్లు పార్క్ చేసి ఉన్న చోట తొలుత మంటలు అంటుకున్నట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. ఆ తర్వాత అది పెట్రోల్ స్టేషన్‌ను పాకి, పేలుడు సంభవించినట్టు వివరించారు.
"పేలుడు తర్వాత వస్తువులన్నీ మా మీద పడ్డాయి. మేము ఏం చూడలేకపోయాము. భారీ శబ్ధం వినిపించింది," అని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఘటనాస్థలంలో పేలుడు తర్వాత ఓ భవనానికి సైతం నిప్పు అంటుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Explosion in Russia death toll : 600 స్క్వేర్ మీటర్ల వరకు మంటలు వ్యాపించాయని, 260 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించిన అదుపుచేశారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
సంబంధిత కథనం