NEET UG 2022 Key | `నీట్ యూజీ` కీ విడుదల!
16 August 2022, 15:42 IST
NEET UG 2022 Key | వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష నీట్(National Eligibility cum Entrance Test -NEET). అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం NEET UG ని నిర్వహిస్తారు.
ప్రతీకాత్మక చిత్రం
NEET UG 2022 Key | ఈ సంవత్సరం NEET UG ని జులై 17న నిర్వహించారు. ఈ పరీక్షను ఎన్‌టీఏ(National Testing Agency-NTA) నిర్వహిస్తుంది. NEET UG 2022 ఆన్సర్ `కీ`ని ఆగస్ట్ 17న విడుదల చేసే అవకాశముంది. ఈ సమాచారాన్ని ఎన్‌టీఏ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
NEET UG 2022 Key | ప్రొవిజనల్ కీ
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ సంవత్సరం నిర్వహించిన NEET UG 2022 సమాధానాల కీ`ని బుధవారం విడుదల చేసే అవకాశముంది. అయితే, ఇది ప్రొవిజనల్ ఆన్సర్ కీ మాత్రమే. ఫైనల్ ఆన్సర్ కీ ని ఈ నెల చివరి వరకు విడుదల చేయాలని ఎన్‌టీఏ అధికారులు భావిస్తున్నారు.
NEET UG 2022 Key | ఇలా చెక్ చేసుకోండి
ఈ NEET UG 2022 ఆన్సర్ కీ నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లో చెక్ చేసుకోవచ్చు. అలాగే,ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ పై తమ అభ్యంతరాలను కూడా అదే వెబ్‌సైట్లో వ్యక్తం చేయొచ్చు. అందుకు వారు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగ్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం NEET UG పరీక్షకు దాదాపు 19 (18,72,341) లక్షల మంది హాజరయ్యారు. జులై 17న ఈ పరీక్ష జరిగింది.
NEET UG 2022 Key | కటాఫ్ ఏంటి?
కామన్ మెరిట్ లిస్ట్‌లో వచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఆధారంగా ర్యాంక్‌లను నిర్ధారిస్తారు. తుది ఫలితాల్లో ర్యాంక్‌తో పాటు పర్సంటైల్‌ను ఎన్‌టీఏ విడుదల చేస్తుంది. గత సంవత్సరం ఈ పరీక్ష (NEET UG 2021)లో జనరల్ కేటగిరీ విద్యార్థుల కటాఫ్ 120 -138 మధ్య ఉంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఈ కటాఫ్ 108 నుంచి 137 మధ్య ఉంది.
NEET UG 2022 Key | ఏ కాలేజీల్లో..
ఈ NEET UG 2022 పరీక్షలో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా భారత్‌లోని అత్యున్నత మెడికల్ కాలేజీల్లో ప్రవేశం లభిస్తుంది. AIIMS న్యూఢిల్లీ, PGIMER చండీగఢ్, Christian Medical College (AIIMS) వెల్లూర్, NIMHANS బెంగళూరు, SGPGIMS లక్నో.. తదితర ప్రముఖ కాలేజీల్లో ప్రవేశానికి ఈ నీట్ ఫలితాలే ప్రాతిపదిక.