Platform ticket prices : ఈ ప్రాంతాల్లో.. ప్లాట్‌ఫాం టికెట్ ధరల తగ్గింపు
04 November 2022, 7:10 IST
Platform ticket prices : పండుగ సీజన్ ముగియడంతో ప్లాట్‌ఫాం టికెట్ రేట్లు పాత స్థితికి చేరుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే రేట్లు తగ్గాయి.
ఈ ప్రాంతాల్లో.. ప్లాట్‌ఫాం టికెట్ ధరల తగ్గింపు
Platform ticket prices : పండుగ సీజన్ నేపథ్యంలో రద్దీని నియంత్రించేందుకు వివిధ ప్రాంతాల్లో ప్లాట్‌ఫాం టికెట్లను పెంచారు రైల్వే అధికారు. ఇక ఇప్పుడు ఆ ధరలు దిగొస్తున్నాయి. తాజాగా.. ఉత్తర రైల్వే.. ప్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గించింది.
ఈ ప్రాంతాల్లో తగ్గింపు..
దీపావళి, ఛత్ పూజ సందర్భంగా రద్దీని నియంత్రించేందుకు.. ప్లాట్‌ఫాం టికెట్ ధరలను రూ. 50 చేశారు. ఇక పండుగ సీజన్ ముగియడంతో పాత ప్లాట్‌ఫాం టికెట్ ధరలు తిరిగి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ప్రస్తుతం ప్లాట్‌ఫాం టికెట్ ధరలు రూ. 10గా ఉన్నాయి.
Platform ticket rates : లక్నో, వారణాసి, బారాబంకీ, అయోధ్య కాంట్, అయోధ్య జంక్షన్, అక్బర్పూర్, షాహ్గంజ్, జౌన్పూర్, సుల్తాన్పూర్ జంక్షన్, రాయ్‌బరేలీ, జంఘై, భదోహి, ప్రతాప్‌గఢ్, ఉన్నావ్ జంక్షన్లో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు తగ్గినట్టు నార్తెన్ రైల్వే డీసీఎం(డివిజనల్ కమర్షియల్ మేనేజర్) నుంచి ఓ ప్రకటన వెలువడింది.
"మొత్తం మీద 14 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్లను రూ.10కి చేశారు. దీపావళి, ఛత్ పూజ సందర్భంగా రూ. 50గా పెంచాము. ఇప్పుడు వాటిని తగ్గించాము," అని డీసీఎం రేఖ శర్మ తెలిపారు.
దక్షిణ రైల్వే..
పండుగ సీజన్లో రద్దీని నియంత్రించేందుకు.. దక్షిణ రైల్వే కూడా ప్లాట్‌ఫాం టికెట్ రేట్లను పెంచింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు అనేక ప్రాంతాల్లోని ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెరిగాయి.
Southern railway Platform ticket prices : చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లోని 8 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు రూ. 10 నుంచి రూ.20కి చేరాయి. పెంచిన ధరలు 2023 జనవరి 31 వరకు అమల్లో ఉంటాయని అప్పుడే ఓ ప్రకటన చేసింది దక్షిణ రైల్వే. చెన్నై సెంట్రల్, చెన్నై ఏగ్మోర్, తంబారం, కట్పాడీ, చెంగల్పట్టు, అరక్కోణం, తిరువల్లూర్, అవాడీ స్టేషన్లలో ఈ రేట్లు కొనసాగుతున్నాయి.
విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రైల్వే స్టేషన్లలో కూడా ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెరిగాయి.
ఇక సెంట్రల్ రైల్వే కూడా ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచింది. ఫలితంగా ముంబై తదితర ప్రాంతాల్లో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెరిగాయి.
మరి ఈ ప్రాంతాల్లో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు తగ్గుతాయా? లేదా? అన్నది వేచి చూడాలి.