తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New Criminal Laws : అమల్లోకి కొత్త క్రిమినల్​ చట్టాలు.. సామూహిక అత్యాచారానికి ఉరి శిక్ష!

New criminal laws : అమల్లోకి కొత్త క్రిమినల్​ చట్టాలు.. సామూహిక అత్యాచారానికి ఉరి శిక్ష!

Sharath Chitturi HT Telugu

01 July 2024, 7:33 IST

google News
    • New criminal laws in India : 3 కీలక నూతన క్రిమినల్​ చట్టాలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. వీటికి సంబంధించి, భారతీయులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను ఇక్కడ చూడండి..
కొత్త చట్టాల గురించి భారతీయులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..
కొత్త చట్టాల గురించి భారతీయులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

కొత్త చట్టాల గురించి భారతీయులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఇవి.. భారతదేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను గణనీయంగా మారుస్తాయి. వలసరాజ్య కాలం నాటి చట్టాలను ఇవి భర్తీ చేస్తాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సక్షా అధినియం.. పాత భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో రానున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు వీటి గురించి కత్చితంగా తెలుసుకోవాల్సిన 10 విషయాలను ఇక్కడ చూడండి.

కొత్త క్రిమనల్​ చట్టాలు..

1. విచారణ ముగిసిన 45 రోజుల్లోగా క్రిమినల్ కేసు తీర్పులు వెలువరించాలి. మొదటి విచారణ జరిగిన 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి. సాక్షుల భద్రత, సహకారం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షి రక్షణ పథకాలను అమలు చేయాలి.

2. అత్యాచార బాధితుల వాంగ్మూలాలను బాధితుల సంరక్షకుడు లేదా బంధువు సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి. ఏడు రోజుల్లో మెడికల్ రిపోర్టులు పూర్తి చేయాలి.

3. మహిళలు, చిన్నారులపై నేరాలను పరిష్కరిస్తూ చట్టంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. పిల్లలను కొనడం లేదా అమ్మడం హేయమైన నేరంగా వర్గీకరించారు. ఇది తీవ్రమైన శిక్షార్హమైనది. మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

4. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మహిళలను వదిలేసిన కేసులకూ ఇప్పుడు చట్టంలో శిక్షలు ఉన్నాయి.

5. నేరాలకు గురైన మహిళా బాధితులు 90 రోజుల్లోగా తమ కేసులకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ పొందే హక్కు ఉంది. నేరానికి గురైన మహిళలు, చిన్నారులకు అన్ని ఆసుపత్రులు ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స అందించాలి.

6. ఎఫ్ఐఆర్ కాపీలు, పోలీస్ రిపోర్టు, చార్జిషీట్, స్టేట్మెంట్లు, కన్ఫెషన్లు, ఇతర డాక్యుమెంట్ల కాపీలను 14 రోజుల్లోగా పొందడానికి నిందితుడు, బాధితురాలు అర్హులు. కేసుల విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలకు అనుమతిస్తాయి.

7. పోలీస్ స్టేషన్​కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సంఘటనలను నివేదించవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టడం వల్ల వ్యక్తులు అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీస్ స్టేషన్​లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేయవచ్చు.

8. అరెస్టయిన వ్యక్తికి వారి పరిస్థితి గురించి తెలియజేసే హక్కు ఉంది. తద్వారా అతను తక్షణ మద్దతును పొందగలడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు సులభంగా అందుబాటులో ఉండేలా పోలీస్ స్టేషన్లు, జిల్లా కేంద్రాల్లో అరెస్టు వివరాలను ప్రముఖంగా ప్రదర్శిస్తారు.

9. తీవ్రమైన నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలానికి వెళ్లి ఆధారాలు సేకరించడం ఇప్పుడు తప్పనిసరి.

10. "లింగం" నిర్వచనంలో ఇప్పుడు ట్రాన్స్​జెండర్​ వ్యక్తులు సైతం ఉన్నారు. మహిళలకు సంబంధించిన పలు నేరాలకు.. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ నమోదు చేయాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే, పురుష మేజిస్ట్రేట్ ఒక మహిళ సమక్షంలో వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. అత్యాచారానికి సంబంధించిన వాంగ్మూలాలను ఆడియో-వీడియో ద్వారా రికార్డు చేయాలి.

తదుపరి వ్యాసం