చీకటిలో మంచంపైకి వచ్చిన పొరుగింటి వ్యక్తి.. భర్త అనుకున్న మహిళ.. ఆ తర్వాత
07 October 2024, 21:18 IST
Crime News : ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. చీకట్లో ఓ మహిళ నిద్రపోయింది. ఇదే సమయంలో పక్కింటి వ్యక్తి వచ్చి ఆమె పక్కనే మంచం మీద పడుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో చూద్దాం..
ప్రతీకాత్మక చిత్రం
ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో ఓ వివాహిత చీకట్లో జరిగిన ఘటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం తెలిసిన పోలీసులు కూడా మెుదట నమ్మలేదు. ఇలాంటి ఘటన జరగడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. చివరకు విషయం కోర్టు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాల మేరకు భదోహిలోని గోపీగంజ్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
34 ఏళ్ల వివాహిత ఫిర్యాదును గురించి గోపీగంజ్ పోలీస్ అధికారి సంతోష్ కుమార్ సింగ్ చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ మహిళకు చెందిన పొరుగున ఉన్న కంచు (32) అనే వ్యక్తి ఆమె పక్కన పడుకున్నాడు. కరెంటు లేకపోవడంతో భర్త వచ్చాడని చీకట్లో ఆ మహిళ భావించింది. కాసేపటి తర్వాత అతని చేష్టల్లో మార్పులు వచ్చాయి. తన భర్త కాదని తెలుసుకునేలోపే ఆమెపై అత్యాచారం చేశాడు కంచు. తెరుకుని తన భర్త కాదని గుర్తుపట్టింది.
దీంతో మహిళ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు కూడా వచ్చి గుమిగూడారు. నిందితుడిని పట్టుకున్నారు. తనకు జరిగిన సంఘటన గురించి పోలీసులకు మహిళ సమాచారం ఇచ్చింది. గొడవ జరిగినప్పుడు కంచు సోదరులు గామై, బోరా కూడా అక్కడికి చేరుకున్నారు. వారు మహిళను అసభ్య పదజాలంతో దూషించారు. పోలీసులు వచ్చే సరికి వారంతా అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని తీసుకెళ్లిన పోలీసులు వెంటనే వదిలేశారు. నిజానికి పోలీసులు ఆమె చెప్పిన విషయం విని అత్యాచారం జరగలేదనుకున్నట్టుగా తెలుస్తోంది. విచారణ లేకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు నిందితుడు కంచుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం, బెదిరింపులు సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన తర్వాత నిందితుడు, అతని ఇద్దరు సోదరులు ఇంటి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.