NEET UG Counselling 2024 : నీట్ యూజీ కౌన్సెలింగ్ షురూ.. కావాల్సిన పత్రాలు.. ముఖ్యమైన తేదీలు ఇవే
14 August 2024, 8:55 IST
- NEET UG Counselling 2024 : నీట్ యూజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి(ఆగస్టు 14) నుంచి ప్రారంభమైంది. ఎంసీసీ నాలుగు విడతల్లో నీట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. కౌన్సెలింగ్‌కు ముఖ్యమైన తేదీలతోపాటుగా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024
నీట్ యూజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నీట్ యూజీ కౌన్సెలింగ్ 2024ను నాలుగు రౌండ్లలో నిర్వహించనుంది. ఈ రౌండ్లలో ఆలిండియా కోటా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, ఆన్‌లైన్ ఖాళీ రౌండ్ ఉన్నాయి. నీట్ అర్హత పొందిన వైద్య ప్రవేశ పరీక్ష విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 710 మెడికల్ కాలేజీల్లో 1.10 లక్షల ఎంబీబీఎస్ సీట్లు, డెంటల్ కాలేజీల్లో 27,868 బీడీఎస్ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఎంసీసీ కౌన్సెలింగ్ ద్వారా అఖిల భారత కోటాలో 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేస్తారు.
ఎంసీసీ కౌన్సెలింగ్ రౌండ్-1 రిజిస్ట్రేషన్ విండో ఆగస్టు 14 నుంచి 20 వరకు మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 20 మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. ఛాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 20 రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. ఛాయిస్ లాకింగ్ ఆగస్టు 20 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్టు 21, 22 తేదీల్లో జరగనుండగా, ఆగస్టు 23న ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి 29 వరకు తమకు కేటాయించిన సంస్థలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
రెండో విడత నీట్ యూజీ కౌన్సెలింగ్ కోసం సెప్టెంబర్ 4 నుంచి 5వ తేదీ వరకు ఆయా సంస్థలు సీట్ల మ్యాట్రిక్స్ వెరిఫికేషన్ నిర్వహించనున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 5న ప్రారంభమై సెప్టెంబర్ 10 (మధ్యాహ్నం 12 గంటల వరకు) కొనసాగుతుంది. ఫీజు చెల్లింపు సదుపాయం సెప్టెంబర్ 10 మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఛాయిస్ ఫిల్లింగ్ సెప్టెంబర్ 6న ప్రారంభమై సెప్టెంబర్ 10 రాత్రి 11.55 గంటలకు ముగుస్తుంది. సెప్టెంబర్ 10న సాయంత్రం 4 గంటల నుంచి 11.55 గంటల వరకు ఛాయిస్ లాకింగ్ ఉంటుంది. సెప్టెంబర్ 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడనున్నాయి.
విద్యార్థులు తాము ఎంచుకున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా మొదటి, రెండో రౌండ్లలో సీట్లను మార్చుకునేందుకు అనుమతిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మూడో రౌండ్ కంటే ముందే సీట్లు రద్దయితే మొత్తం కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపుపై ప్రభావం పడదు. సెప్టెంబర్ రెండో వారంలో మూడో విడత నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మూడో రౌండ్ తర్వాత అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే, ఖాళీ అయిన సీట్లను తదుపరి రౌండ్లలో కూడా ఇవ్వవచ్చు. అయితే మొదటి రౌండ్లో సీట్లు కేటాయించిన అభ్యర్థులు తదుపరి రౌండ్లలో పాల్గొనలేరు. మూడో కేసులో నాలుగో, చివరి రౌండ్ తర్వాత అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తే సుప్రీంకోర్టు ఆమోదంతో ఖాళీ అయిన సీట్లను అదనపు రౌండ్ ద్వారా భర్తీ చేస్తారు.
కావాల్సిన పత్రాలు
10వ తరగతి 12వ తరగతి మార్క్ షీట్ మరియు సర్టిఫికెట్ నీట్
స్కోర్ కార్డ్
ఆదాయ ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
ఒరిజినల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ నివాస ధృవీకరణ పత్రం(కోరితే)
కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువు
కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
స్కాన్ చేసిన సంతకం
బదిలీ సర్టిఫికేట్
దివ్యాంగుల సర్టిఫికేట్ (వర్తిస్తే)
టాప్ 10 మెడికల్ కాలేజీల జాబితా
1. ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్
3. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, తమిళనాడు
4. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్, బెంగళూరు, కర్ణాటక
5. జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరి
6. సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,
ఉత్తరప్రదేశ్ 7. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్
8. అమృత విశ్వ విద్యాపీఠం, తమిళనాడు
9. కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్, కర్ణాటక
10. మద్రాస్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై, తమిళనాడు