తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Pg Merit List : నీట్​ పీజీ ర్యాంకర్స్​కి అలర్ట్​! మెరిట్​ లిస్ట్​ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

NEET PG Merit List : నీట్​ పీజీ ర్యాంకర్స్​కి అలర్ట్​! మెరిట్​ లిస్ట్​ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

08 September 2024, 8:10 IST

google News
    • NEET PG Merit List 2024 : నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించగా, ఆగస్టు 23న ఫలితాలు వెలువడ్డాయి. తాజాగా నీట్​ పీజీ మెరిట్​ లిస్ట్​ని విడుదలైంది. మెరిట్​ లిస్ట్​ని ఎలా చెక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
నీట్​ పీజీ మెరిట్​ లిస్ట్​ విడుదల..
నీట్​ పీజీ మెరిట్​ లిస్ట్​ విడుదల.. (Getty Images/iStockphoto)

నీట్​ పీజీ మెరిట్​ లిస్ట్​ విడుదల..

నీట్​ పీజీ 2024కి సంబంధించిన.. 50 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ) సీట్లకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్​ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) మెరిట్​ లిస్ట్​ని తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు నీట్ పీజీ మెరిట్ లిస్ట్​ని natboard.ecu.in, nbe.edu.in వెబ్​సైట్స్​లో చూసుకోవచ్చు.

నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించగా, ఆగస్టు 23న ఎన్బీఈఎంఎస్ ఫలితాలను ప్రకటించింది. ఎండీ/ఎంఎస్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు/పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ/డైరెక్ట్ ఆరేళ్ల డీఆర్ఎన్బీ కోర్సులు, ఎన్బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులకు ఏఐక్యూ సీట్ల మెరిట్ జాబితాను వేర్వేరుగా విడుదల చేయనున్నట్లు నాడు బోర్డు తెలిపింది.

ఆయా సీట్లకు ఆన్​లైన్​ కౌన్సిలింగ్​కి అర్హత సాధించిన అభ్యర్థుల ఆల్​ ఇండియా కోటా స్కోర్​కార్డ్స్​ని సెప్టెంబర్​ 10 తర్వాత లేదా nbe.edu.inలో ప్రకటిస్తామని బోర్డు పేర్కొంది.

ఇదీ చూడండి:- Indian Navy Recruitment: ఇండియన్ నేవీ లో సెయిలర్ రిక్రూట్మెంట్; అర్హత ఇంటర్మీడియట్ మాత్రమే..

ఆలిండియా 50% కోటా స్కోర్​కార్డులో ఈ వివరాలు ఉంటాయి..

ఏ) ఎండీ / ఎంఎస్ / పిజి డిప్లొమా కోర్సులు / పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్బీ / డైరెక్ట్ 6 సంవత్సరాల డిఆర్ఎన్బి కోర్సులు, ఎన్బీఇఎంఎస్ డిప్లొమా కోర్సులు (2024-25 బి) ఎఐక్యూ నీట్ కౌన్సెలింగ్కు అర్హులైన వారిలో అభ్యర్థి మొత్తం మెరిట్ స్థానం లేదా ర్యాంకు (ఒబిసి / ఎస్సీ / ఎస్టీ / ఇడబ్ల్యుఎస్)

అనంతరం అఖిల భారత కోటా సీట్ల నీట్ పీజీ కౌన్సెలింగ్ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆన్​లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. త్వరలోనే mcc.nic.in తేదీన పూర్తి షెడ్యూల్​ను విడుదల చేయనున్నారు.

నీట్ పీజీ మెరిట్ లిస్ట్ చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

నీట్​ పీజీ 2024 మెరిట్​ లిస్ట్​ని ఇలా చెక్​ చేసుకోండి..

  1. natboard.edu.in వెబ్​సైట్​లోకి వెళ్లండి.
  2. హోమ్ పేజీలో ఇచ్చిన నీట్ పీజీ ఏఐక్యూ మెరిట్ లిస్ట్ చెక్ చేయడానికి లింక్ ఓపెన్ చేయండి.
  3. పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  4. ఇప్పుడు రిజల్ట్ లింక్​పై క్లిక్ చేయాలి.
  5. 50% ఏఐక్యూ సీట్ల కోసం మీ ర్యాంకును చెక్​ చేసుకోండి చేయండి. తదుపరి అవసరాల కోసం దానిని ప్రింటౌట్​ తీసుకోండి.

వాస్తవానికి ఈ ఏడాది జూన్​లో నీట్​ పీజీ 2024 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ నీట్​ యూజీ పేపర్​ లీక్​ స్కామ్​ కారణంగా నీట్​ పీజీ వాయిదా పడింది. చివరికి ఆగస్ట్​లో పరీక్ష జరిగింది.

తదుపరి వ్యాసం