NEET PG Results 2024 : నీట్ పీజీ ఫలితాలు విడుదల- ఇలా చెక్ చేసుకోండి..
NEET PG Results : నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. డైరక్ట్ లింక్‌తో పాటు నీట్ పీజీ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్ పీజీ 2024) ఫలితాలను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. natboard.edu.in, nbe.edu.in అధికారిక వెబ్‌సైట్స్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆగస్టు 11న జరిగిన నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులతో కూడిన పీడీఎఫ్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. నీట్ పీజీ ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే వ్యక్తిగత స్కోర్‌కార్డులు విడుదలవుతాయని అభ్యర్థులు గమనించాలి
నీట్ పీజీ 2024 ఫలితాలు- ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1:- https://natboard.edu.in/ లింక్‌ని ఓపెన్ చేయండి. లేదా పైన ఇచ్చిన డైరక్ట్ లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 2 :- పక్కన పబ్లిక్ నోటీస్‌లోని స్క్రోలింగ్ లిస్ట్‌లో కనిపించే ‘నీట్ పీజీ 2024 ఫలితాలు’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:- ఒక పీడీఎఫ్‌తో కూడిన కొత్త విండో ఓపెన్ అవుతుంది.
స్టెప్ 4:- కిందకి స్క్రోల్ చేసి, “Click here to view result of NEET PG 2024” అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 5:- పీడీఎఫ్‌తో కూడిన ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 6:- అందులో ఫలితాల లిస్ట్ ఉంటుంది. మీ అప్లికేషన్ ఐడీ, రోల్ నెంబర్ వంటి వివరాలను చెక్ చేసుకోండి.
డైరక్ట్‌గా పీడీఎఫ్ ఓపెన్ చేయడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రస్తుతానికైతే నీట్ పీజీ ఫలితాలు పీడీఎఫ్ రూపంలో బయటకు వచ్చాయి. నీట్ పీజీ స్కోర్‌కార్డును అభ్యర్థులు ఆగస్ట్ 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని సమాచారం.
నీట్ పీజీ ఫలితాల తర్వాత ఏంటి?
నీట్ పీజీ 2024 ఫలితాల్లో క్వాలిఫై అయిన విద్యార్థులు కౌన్సిలింగ్ ప్రక్రియకు అర్హత సాధిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా ఎంట్రెన్స్ కోసం నీట్ పీజీ ఫలితాలను ఆమోదిస్తారు. ఈ దఫా పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 26699 ఎండీ, 13886 ఎంఎస్, 922 పీజీ డిప్లొమా సీట్లను భర్తీ చేయనున్నారు.
వాస్తవానికి ఈ పరీక్ష జూన్‌లోనే జరగాల్సి ఉంది. జులైలో ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ నీట్ యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో నీట్ పీజీని వాయిదా వేశారు. చివరికి ఆగస్ట్‌లో నిర్వహించారు. తాజాగా నీట్ పీజీ 2024 ఫలితాలు వెలువడ్డాయి.
ఈ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించారు. మొదటి షిఫ్ట్‌కి 1,07,959 మంది హాజరయ్యారు. రెండో షిఫ్ట్‌లో 1,08,177 మంది పరీక్ష రాశాలు. టెక్నికల్ సమస్యల కారణంగా రెండు సెంటర్లలో పరీక్ష ఆలస్యంగా మొదలైంది.
సంబంధిత కథనం