NEET Case Arrest : నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ-cbi makes first arrests in neet paper leak case from patna two arrested accused gave answer keys to students ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Case Arrest : నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ

NEET Case Arrest : నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ

Anand Sai HT Telugu
Jun 27, 2024 05:42 PM IST

NEET Paper Leak Case : నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితులైన మనీష్ కుమార్, అశుతోష్ కుమార్‌లను సీబీఐ అధికారుల బృందం పాట్నాలో అదుపులోకి తీసుకుంది.

నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు అరెస్టు
నీట్ పేపర్ లీక్ కేసులో ఇద్దరు అరెస్టు

నీట్ ప్రశ్నపత్రం (NEET UG 2024) లీక్ కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ప్రస్తుతం కేసులో ఇదే తొలి అరెస్టు. పాట్నాలో సీబీఐ అధికారుల బృందం నిందితులు మనీష్ కుమార్, అశుతోష్ కుమార్‌లను అదుపులోకి తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. పరీక్షకు ముందు మనీష్ కుమార్, అశుతోష్ కుమార్ ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ లీకైన ప్రశ్నాపత్రాలు, సమాధానాలు ఇచ్చారని కేసుకు సంబంధించిన అధికారులు పీటీఐకి తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసుకు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు కనీసం ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది.

yearly horoscope entry point

ప్రశ్నాపత్రం లీక్ కేసులో బిహార్ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించిన ఒక రోజు తర్వాత ఆదివారం నాడు మొదటి సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఈ ఏడాది నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు డిమాండ్ చేయడంతో కేసును సీబీఐకి అప్పగించారు.

ఈ ఏడాది పరీక్షను మే 5న విదేశాల్లోని 14 సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీక్ కావడంపై పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఈ సంవత్సరం, NEET-UG పరీక్షలో 67 మంది టాపర్లు ఉన్నారు. వీరంతా 720/720 మార్కులు సాధించారు. నీట్ 2023లో ఇద్దరు టాపర్లు, 2022లో ఒకరు టాపర్లుగా నిలిచారు. బుధవారం సీబీఐ బృందం తన దర్యాప్తును జార్ఖండ్‌లో కూడా చేసింది. హజారీబాగ్ ప్రాంతంలోని పాఠశాలను సందర్శించి ప్రిన్సిపాల్‌తో సహా సిబ్బందిని విచారించింది.

NEET-UG పరీక్షలో అవకతవకల వివాదం నేపథ్యంలో, NEET-PG 2024 పరీక్షను నిర్వహించాల్సిన కొన్ని గంటల ముందే కేంద్రం వాయిదా వేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన UGC-NET 2024 పరీక్ష ప్రశ్నాపత్రం డార్క్ నెట్‌లో లీక్ అయినట్లు నివేదించబడిన తర్వాత రద్దు చేశారు.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.