NEET PG Exam 2024 : నీట్ పీజీ పరీక్ష కోసం టెస్ట్ సిటీ లిస్ట్ విడుదల- విద్యార్థులకు అలర్ట్
19 July 2024, 10:15 IST
- నీట్ పీజీ ఎగ్జామ్ 2024 షెడ్యూల్ విడుదలైంది. ఆ జాబితాను ఇక్కడ చూడండి.
నీట్ పీజీ పరీక్ష కోసం టెస్ట్ సిటీ లిస్ట్ విడుదల
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, ఎన్బీఈఎంఎస్ నీట్ పీజీ ఎగ్జామ్ 2024 పరీక్షకు సంబంధించిన నగరాల జాబితాను విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్‌కి హాజరయ్యే అభ్యర్థులు natboard.edu.in వద్ద ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్సైట్లో జాబితాను చూడవచ్చు.
ఎన్బీఈఎంఎస్, ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ తీసుకున్న అదనపు భద్రతా చర్యల కారణంగా నీట్ పీజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా 185 పరీక్షా నగరాల్లో నిర్వహించనున్నారు.
టెస్ట్ సిటీ లిస్ట్ చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2024 జూన్ 23న జరగాల్సిన నీట్-పీజీ 2024 పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసింది. కాగా నాటి పరీక్ష కోసం గతంలో జారీ చేసిన అడ్మిట్ కార్డుల్లో పేర్కొన్న టెస్ట్ సిటీ, టెస్ట్ సెంటర్లు ఇక చెల్లవు.
నీట్-పీజీ 2024 కోసం అడ్మిట్ కార్డులు జారీ చేసిన అభ్యర్థులందరూ ఆన్లైన్ విండోలో తమకు నచ్చిన టెస్ట్ సిటీస్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్ సిటీని ఎంచుకోవడానికి విండో జూలై 19 న ప్రారంభమవుతుంది. జూలై 22, 2024తో ముగుస్తుంది. ఈ విండో ఎన్బీఈఎంఎస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ లాగిన్ క్రిడెన్షియల్స్ ఉపయోగించి దీన్ని తనిఖీ చేయవచ్చు.
అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టెస్ట్ సిటీ కేటాయింపు జాబితా జూలై 29, 2024 న అభ్యర్థులకు వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు ఈమెయిల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. కేటాయించిన పరీక్షా కేంద్రాలను అడ్మిట్ కార్డు ద్వారా తెలియజేస్తారు. దీనిని ఆగస్టు 8, 2024 న వెబ్సైట్లో విడుదల చేస్తారు.
నీట్ పీజీ పరీక్ష 2024 ఆగస్టు 11న జరగనుంది. అయితే అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అనుమతించే షిఫ్ట్ (ఉదయం లేదా మధ్యాహ్నం) ఎంపికను వినియోగించుకోలేరు. రెండు షిఫ్టులకు సంబంధించిన పరీక్ష సమయాలను తగిన సమయంలో నోటిఫై చేస్తారు.
నీట్ పీజీ 2024 అర్హత కోసం ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి కటాఫ్ తేదీ 2024 ఆగస్టు 15గా ఉంటుందని బోర్డు తెలిపింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
సెంటర్ల వారీగా నీట్-యూజీ ఫలితాలు..
గరాల వారీగా, కేంద్రాల వారీగా నీట్-యూజీ 2024 ఫలితాలను జులై 20 మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఫలితాలను వెల్లడించే సమయంలో విద్యార్థుల వివరాలను బహిర్గతపర్చవద్దని స్పష్టం చేసింది. నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.