తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'ఫ్రెండ్​షిప్​ చేయండి, లేకపోతే..' హిందూ బాలికలకు బెదిరింపులు!

'ఫ్రెండ్​షిప్​ చేయండి, లేకపోతే..' హిందూ బాలికలకు బెదిరింపులు!

Sharath Chitturi HT Telugu

12 September 2022, 19:12 IST

google News
    • Hindu girls harassed in Ranchi : రాంచీలో 9వ తరగతి చదువుకుంటున్న హిందూ బాలికలు బెదిరింపులకు గురయ్యారు. తమతో ఫ్రెండ్​షిప్​ చేయాలని, లేకపోతే కిడ్నాప్​ చేస్తామని పలువురు ముస్లింలు ఆయుధాలతో బెదిరించారు. ఇదంతా ఓ స్కూల్​లో జరగడం గమనార్హం.
'ఫ్రెండ్​షిప్​ చేయండి, లేకపోతే..' హిందూ బాలికలకు బెదిరింపులు!
'ఫ్రెండ్​షిప్​ చేయండి, లేకపోతే..' హిందూ బాలికలకు బెదిరింపులు!

'ఫ్రెండ్​షిప్​ చేయండి, లేకపోతే..' హిందూ బాలికలకు బెదిరింపులు!

Hindu girls harassed in Ranchi : ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు ముస్లింలు.. ఓ స్కూల్​లోకి ఆయుధాలతో ప్రవేశించారు. అక్కడి బాలికలను బెదిరించారు. తమతో ఫ్రెండ్​షిప్​ చేయాలని, లేకపోతే కిడ్నాప్​ చేస్తామని హెచ్చరించారు!

స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఆ బాలికలు 9వ తరగతి చదువుకుంటున్నారు. వారిలో కొందరు గిరిజనులు, కొందరు హిందువులు ఉన్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా.. వారికి బెదిరింపులు ఎదురువుతున్నాయి. ఫ్రెండ్​షిప్​ చేయాలని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే కొందరు ముస్లింలు.. ఆయుధాలు పట్టుకుని స్కూల్​లోకి ప్రవేశించి అందరిని బెదిరించారు. తమతో ఫ్రెండ్​షిప్​ చేయాలని , లేకపోతే కిడ్నాప్​ తప్పదని హెచ్చరికలు జారీచేశారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు, కొందరు స్టూడెంట్స్​.. ఆ బృందాన్ని నియంత్రించేందుకు వెళ్లారు. కానీ తమ ఆయుధాలతో వారిని కూడా బెదిరించారు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై విచారణ జరిపేందుకు.. ఐదుగురు సభ్యుల సిట్​ ఏర్పాటైంది. కాగా.. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్​ చేయలేదు. అయితే.. ఘటనకు మతం రంగు రుద్దం సరైనది కాదని పోలీసులు చెబుతున్నారు.

Ranchi crime news : "ఈ వ్యవహారానికి మతం రంగు పూయడం సరైనది కాదు. ఇక్కడ ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు. మేము అమాయకులను ముట్టుకోము. నిందితులను విడిచిపెట్టము," అని ఓ సీనియర్​ పోలీసు అధికారి.. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టూడేకి వెళ్లడించారు.

తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం..

Jharkhand love Jihad incidents : హిందూ బాలికలపై బెదిరింపులకు సంబంధించిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. హేమంత్​ సొరేన్​ ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడింది. లవ్​ జీహాద్​ వంటి కార్యకలాపాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని ఆరోపించింది. హిందూ బాలికలపై ముస్లింలు దాడి చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది.

ఝార్ఖండ్​లో గిరిజనులు, హిందూ బాలికలపై హింసాత్మక ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. కాగా.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న హేమంత్​ సొరేన్​కు ఇవి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

ఇటీవలే.. డుంకా ప్రాంతంలో.. ఓ బాలికకు ఓ వ్యక్తి నిప్పంటించాడు. తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ బాలిక.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే.. డుంకా ప్రాంతంలో మరో బాలిక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. సామూహిక అత్యాచారానికి గురవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి.

తదుపరి వ్యాసం