తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mumbai Man Rescues Kidnapped Daughter: సినీ ఫక్కీలో కూతుర్ని కాపాడుకున్న తండ్రి

Mumbai Man Rescues Kidnapped Daughter: సినీ ఫక్కీలో కూతుర్ని కాపాడుకున్న తండ్రి

HT Telugu Desk HT Telugu

10 September 2022, 21:10 IST

  • Mumbai Man Rescues Kidnapped Daughter: కిడ్నాప్ కు గురైన కూతురిని సినిమా స్టైల్ లో కాపాడుకున్నాడో రోజు కూలీ చేసుకునే తండ్రి. ముంబై నుంచి యూపీకి వెళ్లి, కూతురుని క్షేమంగా తీసుకువచ్చుకున్నాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai Man Rescues Kidnapped Daughter: ముంబైలో ఒక దుండగుడు ఒక బాలికను షాపింగ్ కు వెళ్దామని నమ్మించి తీసుకువెళ్లాడు. కిడ్నాప్ చేసి ముంబై నుంచి యూపీకి వెళ్లాడు. ఆ దుండగుడి వివరాలను సంపాదించిన ఆ బాలిక తండ్రి స్వయంగా ఆ దుండగుడి ఊరికి వెళ్లి తన కూతురును స్వయంగా కాపాడి తెచ్చుకున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

CBSE results 2024 : అతి త్వరలో సీబీఎస్​ఈ ఫలితాలు- డిజీలాకర్​ యాక్సెస్​ కోడ్స్​ విడుదల..

Mumbai Man Rescues Kidnapped Daughter: ముంబైలో..

మంబై బాంద్రా ప్రాంతంలో బాధితురాలి కుటుంబం నివాసం ఉంటుంది. అదే ప్రాంతంలోని ఒక గార్మెంట్ ఫాక్టరీలో నిందితుడు షాహిద్ ఖాన్ పని చేస్తున్నాడు. ఒక రోజు ఆ బాలికను మాయ మాటలతో నమ్మించి, షాపింగ్ వెళ్దామని చెప్పి ఇంట్లో నుంచి తీసుకువెళ్లాడు. తల్లికి అబద్ధం చెప్పి అతడితో వెళ్లింది ఆ బాలిక. అతడు అక్కడి నుంచి ఆ బాలికను కుర్లాకు, అక్కడి నుంచి బస్ లో సూరత్ కు, అక్కడి నుంచి  ట్రైన్ లో ఢిల్లీ వెళ్లాడు.

Mumbai Man Rescues Kidnapped Daughter: తండ్రి ప్రయత్నాలు..

కూతురు రాత్రి వరకు కూడా ఇంటికి రాకపోవడంతో, చుట్టుపక్కల ఆరా తీశారు ఆ బాలిక తల్లిదండ్రులు. హాలీవుడ్ సినిమా `టేకెన్` తరహాలో నిందితుడి ఆచూకీ గుర్తించాడు ఆ బాలిక తండ్రి. అతడు రోజు కూలీ. ఆ బాలిక షాహిద్ ఖాన్ తో వెళ్లిన విషయాన్ని కొందరు స్థానికులు అతడికి చెప్పారు. దాంతో, అతడు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి, నిందితుడి వివరాలు సేకరించాడు. నిందితుడు యూపీలోని అలీఘఢ్ ప్రాంతంలోని ఐత్రోలీ గ్రామానికి చెందిన వాడని తెలుసుకున్నాడు. నేరుగాాాా అక్కడికి వెళ్లి, నిందితుడి కుటుంబ సభ్యులకు విషయం వివరించాడు. స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడి ఆచూకీ తెలుసుకుని తన కూతురుని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చాడు. 

Mumbai Man Rescues Kidnapped Daughter: కేసు నమోదు

సూరత్ కు వెళ్లే సమయంలో తన కూతురిపై నిందితుడు అత్యాచారం చేశాడని, అతడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.